Remuneration of anchors : వెండితెరపై కనిపించే నటీనటులకి మాత్రమే కాకుండా బుల్లితెర యాంకర్ లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో యాంకర్ల ప్రస్తావనకోస్తే మొదటిగా మాట్లాడుకునేది సుమా కానకాల గురించి. సుమా కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో ప్రదీప్ మాచిరాజు , మంజూష, రష్మీ ,వంటి యాంకర్లు తమదైన శైలిలో ,ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. అయితే తెలుగు బుల్లితెర మీద ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ఈ యాంకర్లకు ఎంత రెమ్యూనికేషన్ ఇస్తున్నారో తెలుసా..? ఇండస్ట్రీలో ఉన్న యాంకర్లు మరియు వారి రెమ్యూనరేషన్ లపై ఒక లుక్కేద్దాం పదండి.
సుమ కనకాల.. : తెలుగులో సుమా కనకాలకు మించిన స్టార్ యాంకర్ ఎవరూ లేరు. సుమా లేకుండా ఏ స్టార్ హీరోల సినిమాలు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండవు. ఇలాంటి సుమ ఒక్కో ఈవెంట్ కి దాదాపుగా 3.5 నుంచి నాలుగు లక్షల దాకా రెమ్యూనిరేషన్ తీసుకుంటుందట. ప్రదీప్ మాచిరాజు..; తెలుగు ఇండస్ట్రీలో మెయిల్ యాంకర్లలో ముందుగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. తెలుగులో ప్రదీప్ కు మంచి క్రేజ్ ఉంది. దీంతో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ప్రదీప్ ఒక్కో ఈవెంట్ కు దాదాపుగా 2 లక్షల వరకు రెమ్యూనికేషన్ తీసుకుంటారట.

అనసూయ భరద్వాజ్.. : అనసూయ ఒకవైపు సినిమా లలో నటిస్తూనే మరోవైపు బుల్లి తెర మీద నటిస్తూ అందర్నీ ఆకర్షిస్తుంది. తన గ్లామర్ తో యువతను పిచ్చెక్కిస్తుంది అనసూయ. అనసూయ ఒక్కో ఈవెంట్ కు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమినేషన్ తీసుకుంటుందట.
రశ్మి గౌతమ్ : ఎక్సట్రా జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మీ గౌతమ్. అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ బుల్లితెర మీద మంచి క్రేజ్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇమె కూడా ఒక్కో ఈవెంట్ కు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనికేషన్ తీసుకుంటుందట.
మంజుష వర్షిని : ఈ మధ్యన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్షిని పేరు కూడా బాగానే వినిపిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది వర్షిని. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్కో ఈవెంట్ కు దాదాపుగా 50వేల వరకు రెమెంటేషన్ తీసుకుంటుందట.