Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలకు చెక్ పెట్టే ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. తన ఇద్దరి మాజీ భార్యలకు భరణంగా ఇచ్చిన మొత్తాన్ని మీడియా కార్యకర్తల ముందు వెల్లడించాడు పవన్ కళ్యాణ్. వాళ్లకి నాకు సెట్ కాలేదు అందుకే లీగల్ గా విడాకులు ఇచ్చి విడిపోయాము అంటూ చెప్పారు. మీకు కూడా మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తే విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోండి అంటూ సూటిగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తన మొదటి భార్యకు ,ఐదు కోట్లు ఇచ్చానని అలాగే రెండో భార్య అయిన రేణు దేశాయ్ కి ఆస్తి రాసిచ్చానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే గతంలో రేణు దేశాయ్ ఈ విషయంపై మాట్లాడుతూ నేను 15 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి వచ్చానని, 19 ఏళ్లకే సొంతంగా ఫ్లాట్ కొనుక్కున్నానని చెప్పింది.
రైటర్ గా , డైరెక్టర్ గా , ఫ్యాషన్ డిజైనర్ గా , నేను డబ్బులు సంపాదించుకుంటున్నానని, పవన్ కళ్యాణ్ నాకు డబ్బులు ఇచ్చారు అని వస్తున్నా ఆరోపణలు నిజం కాదు అని చెప్పారు. అలాగే నా పిల్లల పోషణ మరియు చదువు వారి బాధ్యతలు మొత్తం నేనే తీరుస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి లో ఎవరు చెప్పింది నిజం అనేది అర్థం కావడం లేదు.పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్ పరోక్షంగా సోషల్ మీడియాలో ఒక వార్తను పోస్ట్ చేసింది. ఇక్కడ నీ వర్షన్ కాదు నా వర్షన్ కాదు నిజం అనేదే శాశ్వతం అంటూ కొటేషన్ రాసి వీడియో ద్వారా విడుదల చేసింది. ఇది ఇలా ఉండగా రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ ఆదుకోకపోతే ఆమె ఇన్నాళ్లు మనుగడ సాధించగలరా? పూణే లాంటి లగ్జరీ నగరంలో ఇద్దరు పిల్లలతో అంత ఈజీగా బ్రతకగలదా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన రేణు దేశాయ్ సొంత సంపాదన ఉన్నప్పటికీ, సొంత సంపాదనతో సినిమాలు నిర్మించడం సాధ్యమయ్యే పనేనా..? ఒక ఫ్యాషన్ డిజైనర్ అంత సింపుల్ గా నిర్మాత అవుతుందా..? అనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఇచ్చిన దానికి ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు. ఉన్న ఆయన బయటపెట్టరు. ఆ ఉద్దేశంతోనే రేణు దేశాయ్ ఇలా పలు ఆరోపణలు చేస్తుందేమో. విడాకులు ఇచ్చి పదేళ్లు అవుతున్న పవన్ కళ్యాణ్ ఏనాడు ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఇప్పుడు కూడా కేవలం తన పైన వస్తున ఆరోపణలకు సమాధానంగా ఈ నిజాన్ని వెల్లడించారు పవన్ కళ్యాణ్.