Renu Desai : ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ కపుల్‌గా పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్‌లు ఉండేవారు. వారిని చూస్తే ఎవరికైన జలస్ వచ్చేది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటకు అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో వీరిద్దరు విడాకులు తీసుకొని వారి వారి లైఫ్‌లు గడుపుతున్నారు. అయితే పిల్లల కోసం అప్పుడప్పుడు కలిసి కనిపిస్తున్నారు. విడాకుల తర్వాత కూడా పవన్ రేణుతో సన్నిహితంగా ఉండటం వల్లే మూడో భార్యతో కాస్త గ్యాప్ వచ్చిందన్న గుసగుసలు కూడా తాజాగా వినిపిస్తున్నాయి.
రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తుండగా, ఇందులో రేణు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే రేణు ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండడంతో పవన్ అభిమానుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ సరికొత్త చర్చ నడుస్తోంది. పవన్ – రేణు మళ్లీ దగ్గరయ్యే ఛాన్సులు ఉన్నాయని… పవన్ మదిలో రేణు జ్ఞపకాలు మెదలడం ఖాయం అని అభిమానులు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందో..! ఇక పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చిన సమయంలో రేణుదేశాయ్ కి భారీ మొత్తంలో భరణం పొందింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పవన్ కళ్యాణ్ తనకు ఒక్క రూపాయి కూడా భరణం చెల్లించలేదని.తాను కూడా అడగలేదు అంటూ అప్పుడు రేణూ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Renu Desai : ఆమె జ్ఞాపకాలతో..
రేణూ దేశాయ్‌కి జూబ్లీహిల్స్‌లో ఒక ఖరీదైన ఇల్లు ఉందట అంతే కాకుండా మూడు కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పూణేలో కూడా ఎన్నో స్థిరాస్తులను కలిగి ఉందట రేణుదేశాయ్.ఇక ఇవన్నీ కలిపితే రేణు దేశాయ్ ఆస్తుల విలువ 40 కోట్ల వరకు ఉంటుందని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక 2012 లో పవన్ కళ్యాణ్ అధికారికంగా రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చేశాడు. విడాకుల తర్వాత రేణు మకాం పూణెకి మార్చేశారు. అక్కడే పిల్లలతో జీవనం సాగించారు. ఈ మధ్యలో రెండో పెళ్లి ప్రయత్నాలు కూడా చేశారు. దాన్ని పవన్ అభిమానులు వ్యతిరేకించారు. ఆమెపై సోషల్ మీడియా వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారు.