Actress Asin : చూడ చక్కని అందంతో ఆకట్టుకున్న అందాల ముద్దుగుమ్మ ఆసిన్. మలయాళ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగుహీరోల సరసన కూడా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ కేరళ కుట్టి తమిళంతో పాటు తెలుగులో కూడా ఎంతోమంది బడా హీరోల సరసన మెరిసింది. రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కేకిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.మొదటి సినిమాలో ఎంతో అమాయకంగా ఉండే అమ్మాయి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఘర్షణ సినిమాతో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఎంతో బిజీగా ఉన్న సమయంలో మైక్రోమ్యాక్స్ సహవ్యవస్థాపకుడు రాహుల్ శర్మను 2016 లో వివాహం చేసుకుంది. అక్షయ్ కుమార్ మూవీ లో హీరోయిన్ ఆసిన్ నటించిన సమయంలో ఓ సినిమా ఫంక్షన్ కి రాహుల్ కూడా వచ్చాడు.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిపోవడంతో ఇక వీరి ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. ఈ జంటకి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే అసలు వీరి పెళ్లి మాత్రం చాలా విచిత్రంగా జరిగింది.

Actress Asin : అలా చేశాడా..
ఇక వివాహం సమయంలో బాలీవుడ్ పెద్దల కోసం ఆశిన్ దంపతులు ఒక విందు ఏర్పాటు చేశారు. ఈ పార్టీ కి బాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది అగ్ర తారలు, సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ కూడా పాల్గొన్నారు.ఆ వేడుకలో రిషి కపూర్ పీకల దాకా తాగి నానా రచ్చ చేశారట. సంగీతం బాగోలేదని, లైటింగ్ నచ్చలేదంటూ రిషి కపూర్ బాగా హంగామా చేశారు. దాంతో రాహుల్ శర్మ కలిగించుకొని గొడవ సద్దుమణిగేలా చేసినా.. అప్పటికే పార్టీ మూడ్ పాడవడంతో సెలబ్రిటీస్ అంతా వెళ్లిపోయారు. ఈ విషయం అప్పట్లో చాలా హాట్ టాపిక్ అయింది. రిషి కపూర్ ఒకప్పుడు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన విషయం తెలిసిందే.