Roja : ప్రస్తుతం బుల్లితెరపై రోజా హవా తగ్గింది. మంత్రి పదవి రావడంతో రోజా.. బుల్లితెరకు దూరంగా ఉంటోంది. జబర్దస్త్ జడ్జ్ సీటును వదిలేసి.. మంత్రి సీటును పట్టేసుకుంది రోజా. ఇక ఇప్పుడు దసరా ఈవెంట్ కోసం బుల్లితెరపైకి వచ్చింది రోజా. అలా వచ్చీ రాగానే అందరినీ ఆడేసుకుంది రోజా. ఆది, శ్రీముఖి ఇలా అందరి మీద వరుసగా పంచులు వేసేసింది. దసరా వైభవం అంటూ వదిలిన ఈ ప్రోమోలో రోజా దుమ్ములేపేసింది. మామూలుగా అయితే శ్రీముఖి.. అన్ని చానెళ్లలో కనిపిస్తోంది. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని చానెళ్లలో శ్రీముఖి కనిపిస్తోంది.
స్టార్ మాలో స్పెషల్ ఈవెంట్లలో కనిపిస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, సీరియల్ తారలతో స్టార్ మా చేసే ఈవెంట్లకు శ్రీముఖి హోస్ట్‌గా ఉంటోంది. ఇక ఈటీవీలో అయితే జాతి రత్నాలు అనే షోతో సందడి చేస్తోంది. జీ తెలుగులో ఇన్నిరోజులు సింగింగ్ షోతో హల్చల్ చేసింది. ఇలా అన్ని చానెళ్లలో శ్రీముఖి కనిపిస్తోంది. దీనిపైనా రోజా కౌంటర్ వేసింది. హీరోయిన్ అయ్యారు.. ఎమ్మెల్యే అయ్యారు.. మంత్రి అయ్యారు.. ఇలా మీలా ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలని రోజాని ఆది అడుగుతాడు. ఇలా కనిపించిన అమ్మాయి వెంట తిరగొద్దు అని ఆదికి కౌంటర్ వేస్తుంది రోజా. ఇక్కడున్న వాళ్లందరిలో ఎవరెవరికి ఏ ఏ శాఖ అయితే బాగుంటుంది అని రోజాని అడిగాడు ఆది.

శ్రీముఖికి ఏ శాఖ బాగుంటుందని అడిగాడు. శ్రీముఖికి అయితే పర్యాటక శాఖ బాగుంటుందని, అన్ని చానెళ్లకు తిరుగుతోందని కాబట్టి ఆ శాఖే బెటర్ అని రోజా కౌంటర్ వేసింది. మరి నాకు అని ఆది అడిగాడు. నీకు ఆహార భద్రత శాఖ అయితే బాగుంటుందని రోజా కౌంటర్ వేస్తోంది. ఎందుకు మేడం అని ఆది అడుగుతాడు. ఈ మధ్య నీ ఆకలి గురించి వింటున్నాలే అని డబుల్ మీనింగ్ వేస్తుంది రోజా. దీంతో ఆది సైలెంట్ అవుతాడు. మధ్యలో శాంతి ఎంట్రీ ఇస్తాడు. మరి నాకు ఏ శాఖ మేడం అని అడుగుతుంది. ఇంతలో ఆది కౌంటర్ వేస్తాడు. నీకు శాఖ కాదు పాకే అని డబుల్ మీనింగ్ డైలాగ్ వేయడంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు.