Sai Pallavi : బిగ్ బాస్ 6 లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కళ్యాణ్ తెలుసు కదా. ప్రస్తుతం హౌస్ లో టాప్ పొజిషన్ లోనే ఉన్నాడు. ఇచ్చిన టాస్క్ లు చేస్తూ బిగ్ బాస్, ప్రేక్షకుల దృష్టిలో మంచి మెప్పు పొందాడు. అయితే.. అసలు ఈ అర్జున్ కళ్యాణ్ ఎవరు.. అనేది చాలా మందికి తెలియదు. ఈయన తెలుగు సినిమాల్లో అడపా దడపా కనిపించాడు. వైజాగ్ కుర్రాడు. యూఎస్ లో మాస్టర్స్ చేసి అక్కడే థియేటర్ కోర్సులోనూ యాక్టింగ్ కోర్సు చేశాడు.
సినిమాల్లోనే కాదు… పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించాడు అర్జున్ కళ్యాణ్. కానీ.. చాలా మందికి అర్జున్ కళ్యాణ్ గురించి తెలియదు. పలు సూపర్ హిట్ సినిమాల్లోనూ ఈయన నటించాడు. స్టార్ హీరోయిన్ సాయి పల్లవితోనూ నటించాడు. ఇంతకీ అది ఏ సినిమా అంటారా? వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సినిమా. ఈ సినిమాలోనే అర్జున్ కళ్యాణ్ నటించాడు. ఆ సినిమాలో వరుణ్ తేజ్ మీద కోపంతో సాయి పల్లవి హర్ష వర్ధన్ రాణేతో పెళ్లికి ఒప్పుకుంటుంది తెలుసు కదా. కానీ.. ఆ పాత్రలో ముందుగా అర్జున్ కళ్యాణ్ ను అనుకున్నారట. సీన్స్ షూట్ కూడా చేశారట. తర్వాత ఏమైందో కానీ.. ఆ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. అర్జున్ కళ్యాణ్ ను పక్కన పెట్టి చివరకు హర్ష వర్ధన్ ను తీసుకున్నారట.

Sai Pallavi : అనన్యతో ప్లే బ్యాక్ సినిమాలో హీరోగా నటించిన అర్జున్
అయితే.. అర్జున్ కళ్యాణ్ ప్లే బ్యాక్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ సినిమాలో వకీల్ సాబ్ లో హీరోయిన్ గా నటించిన అనన్య నాగళ్ల ఈ సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. అర్జున్ కళ్యాణ్ డ్యాన్స్ చేయడంలో దిట్ట. అలాగే.. మనోడికి స్క్రీన్ ప్లే రైటింగ్, డైలాగ్ రైటింగ్ లోనూ గ్రిప్ ఉంది. ఇక.. బిగ్ బాస్ విషయానికి వస్తే ప్రస్తుతం అర్జున్ బిగ్ బాస్ లో చాలా కూల్ గా ఆడుతున్నాడు. ఇలాగే.. కూల్ గా ఆడితే టాప్ 5 లోకి రావడం మాత్రం పక్కా.