Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటారు.ఐదు పదుల వయస్సు దాటిన కూడా చాలా ఉత్సాహంతో సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నారు. అయితే ఇటీవల సల్మాన్ పాము కాటుతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. పన్వేల్‌లోని తన ఫామ్ హౌస్‌లో సల్మాన్‌ని ఓ పాము కాటేయడంతో సల్మాన్ భాయ్ వ్యక్తిగత సిబ్బంది ఆయనను వెంటనే ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సల్మాన్‌ని పరిశీలించిన వైద్యులు చికిత్స చేయడంతో త్వరగానే కోలుకున్నారు. ఇక తాజాగా సల్మాన్ మంచాన పడ్డారు. డెంగ్యూతో సల్మాన్ ఖాన్ బాధపడుతున్నాడట. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సల్మాన్‌కు పరీక్షలు నిర్వహిస్తే డెంగ్యూ అని తేలిందట.
దీంతో వారం రోజులు పాట విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. అనారోగ్యం వలన సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 16 హోస్టింగ్‌కు కూడా కొంత విరామ ప్రకటించినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ షోకు కొత్త హోస్ట్‌ను తీసుకువచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ స్థానంలో కరణ్ జోహార్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తారని వస్తారని ప్రచారం జరుగుతోంది. కరణ్ గతంలో ‘బిగ్ బాస్ OTT’ని హోస్ట్ చేశాడు. ఇక సల్మాన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవలసి ఉన్న నేపథ్యంలో ఆయన నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీ షూటింగ్‌కు కూడా దూరంగా ఉండనున్నారు. ఇదిలా ఉంటే హీరో జయం రవికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం నేను క్వారంటైన్‌కు పరిమితమయ్యాను.. ఈ రెండుమూడు రోజులు నన్ను కలిసిన ప్రతీ ఒక్కరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ మాస్క్ వేసుకోండి.. జాగ్రత్తగా ఉండండి’ అంటూ జయం రవి ట్వీట్ వేశాడు.

Salman Khan : గెట్ వెల్ సూన్..
అలా మొత్తానికి ఇప్పుడు మన హీరోలు ఇలా డెంగ్యూ, కరోనాతో బాధపడుతున్నారు. సల్మాన్ ఖాన్ ఈ మధ్యే గాడ్ ఫాదర్ అంటూ చిరంజీవి పక్కన స్పెషల్ కారెక్టర్లో కనిపించాడు. ఇక జయం రవి అయితే పొన్నియిన్ సెల్వన్ సినిమాలో పవర్ ఫుల్ రోల్లో కనిపించి మెప్పించాడు. పొన్నియిన్ సెల్వన్ టైటిల్ రోల్ పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు.ఈ ఇద్దరు హీరోలు అనారోగ్యం బారిన పడడం అభిమానులని తెగ కలవరపరుస్తుంది. వారిద్దరు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.