Samantha Chinmayi : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరును సంపాదించుకొంది సమంత. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ప్రాజెక్టులను చేస్తుంది సమంత. అలాగే కొన్ని సిరీస్ లో కూడా నటిస్తూ తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే ఇప్పుడు సమంత శాకుంతలం సినిమాతో ముందుకొస్తుంది. ఇంకా ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే విజయ్ తో చేయన్నున ఖుషి మూవీ షూటింగ్ జరుగుతుంది .ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెడదామని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ .దీనికోసం తను ముంబైలో ఇల్లు కూడా తీసుకుందట..అయితే సమంత తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తనకు తెలుగు భాష మాట్లాడడం రాదు.
దీనివలన సమంత వాయిస్ కు సింగర్ అయినా చిన్మయి డబ్బింగ్ చెప్పారు . సమంత మొదటి చిత్రమైన “ఏం మాయ చేసావే” సినిమాలో సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఈ సినిమాలోని చిన్మయి వాయిస్ సమంతకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఆ వాయిస్ కు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ విధంగా చిన్మయి చాలా సంవత్సరాలుగా సమంతకు డబ్బింగ్ చెబుతూ వస్తుంది. ఈ క్రమంలో ఓసారి చిన్మయి సమంతకు డబ్బింగ్ చెప్పను అని చెప్పిందట. ఆ టైంలో సమంత వెళ్లి చిన్మయి ని బ్రతిమిలాడితే మళ్ళీ డబ్బింగ్ చేసేందుకు చిన్మయి ఒప్పుకుంది.

ఇలా కొంతకాలం జరిగిన తర్వాత వీరి మధ్యలో ఏమైందో ఏంటో కానీ సమంత తన సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెట్టింది. దీంతో చిన్మయి వాయిస్ ను చాలా మంది కుర్రాళ్ళు మిస్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం సమంతా వాయిస్ అంతగా బాగోలేదని కామెంట్స్ వస్తున్నాయి. తన వాయిస్ వలన కొన్ని మూవీస్ సరిగా హిట్ అవడం లేదని తెలుస్తోంది.దీంతో యశోద మూవీ మేకర్స్ మళ్లీ చిన్మయి చేత డబ్బింగ్ చెప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారట కానీ సమంత ఒప్పుకోవడం లేదని సమాచారం. అయితే అసలు వీరి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కాని సమంత వాయిస్ కు చిన్మయి డబ్బింగ్ చెప్పాలని చాలామంది కోరుకుంటున్నారు.