Samantha : సమంత, నాగ చైతన్య జంటగా తెరకెక్కిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2017లో పెళ్లి చేసుకున్నారు. ఊహించని విధంగా గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిగింది. ఏ మాయ చేశావే చిత్ర షూటింగ్ సమయంలో వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కూడా మంచి లవ్‌స్టోరి చిత్రం కావడం.. తెరపై వారి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది.
ఏ మాయ చేశావే చిత్రంలో స్టోరీకి అనుగుణంగా వాళ్ళు ట్రైన్లో వెళ్లేటప్పుడు నాగచైతన్య సమంత రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. సమంత నాగచైతన్య ట్రైన్ లో కూర్చొని ఉన్నప్పుడు నాగచైతన్య సమంతకు టక్కును ముద్దు పెట్టేస్తాడు . ఈ సీన్ చేయడానికి నాగ చైతన్య అనేక టేకులు తీసుకోవడమే కాక చాలా ఇబ్బంది పడ్డాడట. కిస్ పెట్టేటప్పుడు ఇబ్బంది పడుతూ సరైన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేకపోతున్నాడట. ఇది గమనించిన సమంత మాత్రం ఏమాత్రం భయం లేకుండా నాగచైతన్య తల ముందుకు పెట్టగానే తనే ఫోర్స్ తీసుకొని ముద్దు పెట్టేసిందట . మనకు మాత్రం సినిమాలో చూపించేటప్పుడు నాగచైతన్య ముద్దు పెట్టినట్టు క్రియేట్ చేశారు . ఏది ఏమైనా సరే సమంత మంచి గడుసు పిల్లే అని అంటున్నారు.

Samantha : అలా చేసిందా..
ఇటీవల కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోకు వచ్చిన సమంత.. ఆ షోలో నాగచైతన్యతో ఎందుకు విడిపోయానన్న విషయంమాత్రం చెప్పలేదు. కానీ ఆ షోలో సమంతకు.. చై మీద మాత్రం పీకలదాకా కోపం వుందని మాత్రం తెలిసింది. తన పేరు ఎక్కడ కూడా ఎత్తకుండానే షో మాత్రం మాట్లాడింది. సమంత మరియు నాగ చైతన్య ని పెట్టి ఒక సినిమా చెయ్యాలనే ఆలోచనలో ప్రముఖ టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు ఫిలిం నగర్ లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది..విడాకులు తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తే అదొక క్రేజీ కాంబినేషన్ అవుతుందని..బాక్స్ ఆఫీస్ వద్ద కూడా బాగా వర్కౌట్ అవుతుందని దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు సమాచారం.