Samantha : ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన సమంత ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పెళ్లైన, విడాకులు తీసుకున్నా కూడా సమంత క్రేజ్ తగ్గలేదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ , హాలీవుడ్ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సమంత ఇటీవల శాకుంతలం అనే చిత్రంలో నటించగా, ఈ సినిమా వెనక్కు పోతూ ఉంది. ప్రముఖ సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శకుంతల-దుష్యంతుడి ప్రేమకథను ఇందులో చూపెట్టనున్నారు. దుష్యంతుడిగా దేవ్‌మోహన్ నటించారు.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 4న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు. త్రీడీ కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అనుకున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నామని రీసెంట్గా ప్రకటించారు. ప్రేక్షకులకు అద్భుతమైన వీక్షణానుభూతిని అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. సినిమా జ్ఞాపకాల్ని చిరకాలం భద్రపరచుకోవాలనే ఆలోచనతో త్రీడీలో అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు.

Samantha : అభిమానులు ఫైర్..
సమంత మరోవైపు హిందీ సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. హిందీ దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వం లో సమంత స్త్రీ అనే సినమా చేస్తుంది. జానపద కథల ఆధారంగా రూపొందిస్తున్నారట. ఇందులో సమంత డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రంలో సమంత.. రాజ్ పుత్ యువ రాణితో పాటు దెయ్యం పాత్రలోను కనిపించనుందట. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం మంచి పాత్రలు చేసుకోకుండా ఇలాంటి ప్రయోగాలు ఎందుకంటూ సమంతకు చురకలు అంటిస్తున్నారు. అది అలా ఉంటే సమంత గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ముంబైలో 30 కోట్లతో ఓ భారీ ఇల్లును తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.