Samantha : ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా ఉన్న నాగ చైతన్య సమంత గత ఏడాది అక్టోబర్‌లో విడిపోయిన విషయం తెలిసిందే. వీరి మధ్య ఏం జరిగిందో కాని ఊహించని విధంగా విడాకులు తీసుకొని వార్తలలో నిలిచారు. అయితే వీరు విడిపోయి చాలా రోజులే అవుతున్నా కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇష్యూలో వైరల్ న్యూస్ అవుతూనే ఉన్నారు ఇద్దరు. వీరి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాము. ఒక విషయం మర్చిపోక ముందే.. మరోక విషయం హైలెట్ అవుతూ.. నెట్టింట హడావిడి జరుగుతుంది. ఇటీవల కరణ్ షోలో సమంత.. చైతూ తనకు హస్బెండ్ కాదు ఎక్స్ హస్బెండ్ అంటూ.. మాట్లాడింది. తామిద్దరిని ఒక గదిలో ఉంచితే.. అందులో ఆయుధాలు లేకుండా చూడాలంటూ.. చైతూపై కోపం ఎంతుందో చూపించుకుంది.
సమంత, చైతూ డైరెక్ట్ గా చెప్పిన విషయాలు పక్కన పెడితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకి మాత్రం అడ్డు అదుపు లేకుండా పొయింది. తాజాగా సమంత, నాగార్జున విజయ వాడ గల్లీలో పోట్లాడుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వివరాలలోకి వెళితే పోయిన ఎన్నికల్లో వైసీపీ తరుఫున ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పీవీపీ వైసీపీ తరుఫున పోటీచేసి ఓడిపోయాడు. ఇక్కడ టీడీపీ నుంచి నిలబడ్డ కేశినేని నాని ఎంపీగా గెలిచాడు. అయితే ఈ సారి ఆ స్థానాన్ని హీరో నాగార్జునకి ఇవ్వాలని జగన్ భావిస్తున్నాడట. ఇక ఎప్పటి నుండో నాగార్జున రాజకీయాలలోకి రావాలని భావిస్తున్న నేపథ్యంలో ఇదే సరైన సమయం అనుకుంటున్నాడట.

Samantha : తప్పుడు రూమర్స్..
దీనిపై నాగార్జున కానీ.. అటు వైసీపీ శ్రేణులు కానీ ధ్రువీకరించలేదు. దీంతో వైరల్ అవుతోంది.ఇక వైసీపీ తరుఫున మామ అక్కినేని నాగార్జున నిలబడితే.. జనసేన తరుపున ఆయన మాజీ కోడలు సమంత పోటీకి దిగబోతోందని, ఈ రకంగా అక్కినేని ఫ్యామిలీపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుందని నెట్టింట తెగ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై అటు నాగార్జున కానీ.. ఇటు సమంత కానీ స్పందించకపోయినా సరే ఈ సోషల్ మీడియా ఉద్యమకారులు ఓన్ చేసుకొని మరీ ట్రెండ్ చేస్తున్నారు.ఇది పక్కా గాసిప్ అని అందరికి తెలుసు. కాని సోషల్ మీడియాలో కొందరు మాత్రం ఇలాంటి తప్పుడు వార్తలని తెగ ప్రచారం చేస్తూ వార్తలలో నిలిచేలా చేస్తున్నారు.