Samantha : ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి , మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మృతి అందరిని కలిచి వేసిన విషయం తెలిసిందే. ఇందిరా దేవి మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇందిరా దేవి మృతి పట్ల ఓ ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని వెల్లడించారు.
ఈ బాధ నుండి కృష్ణ గారు, మహేష్ బాబు గారు త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనలో తెలిపారు. ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధాకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని బాలకృష్ణ తెలిపారు. చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఇందిరా దేవికి నివాళులు అర్పించారు.

Samantha : మంచి రిలేషన్..
అయితే అందరి కన్నా సమంత ఈ విషయంలో ఎక్కువగా బాధపడిందట. అందుకు కారణం సమంతకు మహేష్‌తో పాటు వారి ఫ్యామిలీతో సమంతకు ఉన్న సాన్నిహిత్యమే. దూకుడు సినిమా నుండి మహేష్‌తో మంచి రిలేషన్ ఉందట సమంతకి. మహేష్ కూతురితో కూడా సమంత చాలా సరదాగా ఉంటుది. ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ సమంత అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే మహేష్తల్లి మృతి చెందడంతో సమంత చాలా హర్ట్ అయిందట. ప్రస్తుతం తాను విదేశాలలో ఉన్న నేపథ్యంలో మహేష్ తల్లిని కడసారి చూసేందుకు రాలేకపోయిందని చెబుతున్నారు.