Samantha – Naga Chaitanya : ఈ మధ్య కాలంలో చాలా మంది విడాకుల బాట పడుతున్నారు. కారణాలు తెలియడం లేదు కాని చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సమంత- నాగ చైతన్య విడిపోవడం అందరిని బాధిస్తుంది. నాలుగేళ్ల ప్రేమించుకున్న వారిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చక్కటి జంట అని అందరూ అనుకునేవారు. అయితే అందరికీ వీరిద్దరూ షాకిచ్చారు. ఇద్దరి మధ్య మనస్పర్దలు ఏంటో ఏమో కానీ.. విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ విడిపోయి దాదాపు ఏడాది కావస్తుంది. ఇప్పటికీ వారిద్దరికీ సంబంధించిన ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది.
అయితే ఇప్పుడు వీరి మాదిరిగానే మరో జంట విడిపోబోతున్నారనే ప్రచారం నడుస్తుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతలా ఆమె తన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ ఏర్పరుచుకున్నారు. మ్యారేజ్ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె చేస్తుంది. ఇటీవల తన భర్త రణ్వీర్ సింగ్తో కలిసి ‘83’లో నటించింది. ఇందులో దీపికా.. కపిల్ దేవ్ భార్య పాత్రలో నటించారు. ఇప్పటి వరకు తన భర్త రణ్వీర్ సింగ్తో కలిసి నటించిన సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన దీపికా.. 83లో మాత్రం కపిల్ భార్య రోమి పాత్రలో నటించి మెప్పించారు.

Samantha – Naga Chaitanya : విడిపోవడం ఖాయమా?
రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే. వీరిద్దరు మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లోనే ప్రేమలో పడ్డారు. వెంటనే పెళ్ళి కూడా చేసుకున్నారు. పెళ్ళి తరువాత కూడా ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీ అయిపోయారు. 2018 పెళ్ళి చేసుకున్న ఈ బాలీవుడ్ జంట అన్యోన్యంగా ఉంటూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీపికా రణ్వీర్ సింగ్ పెళ్లి జరిగి ఇంకా నాలుగేళ్లు కూడా పూర్తి కాలేదు. అయితే ఈ స్టార్ కఫుల్ మధ్య కొన్ని కలతలు చోటు చేసుకున్నాయా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి మధ్య ముందున్నంత సఖ్యత ఉండటం లేదని వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత నాగ చైతన్య మాదిరిగా విడిపోవడం ఖాయం అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.