Samantha: చూడచక్కని జంట అంటే ఠక్కున గుర్తొచ్చేది సమంత- నాగ చైతన్య. వీరిద్దరు ఎంత అన్యోన్యంగా ఉండే వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత- నాగ చైతన్యని చూడగానే భలేగుందిగా జంట అని అనుకునేవారు. జిష్టి తగిలిందో ఏమో కాని ఇరువురు విడాకులు తీసుకొని అందరికి పెద్ద షాకిచ్చారు. గత ఏడాది అక్టోబర్ 2న ఈ జంట విడిపోగా, మరి కొద్ది రోజులు అయితే వీరు విడిపోయి ఏడాది అవుతుంది. సమంత, నాగ చైతన్య తొలిసారిగా.. 2009లో ఏ మాయ చేసావే చిత్రం సెట్స్‌లో కలుసుకున్నారు. వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కూడా మంచి లవ్‌స్టోరి చిత్రం కావడం..
తెరపై వారి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. దీంతో ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్లారు. 2015లో నాగ చైతన్య బర్త్ డే రోజు విష్ చేస్తూ సమంత చేసిన ట్వీట్.. వారి మధ్య ఏదో ఉందనే ప్రచారానికి తెర తీసింది. ఆ ట్వీట్లో సమంత.. నా అభిమాన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొనడం పెద్ద సంచలనమైంది. దాంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం జరిగింది. కొద్ది రోజులు అది నిజమే అని తేలింది. ఇద్దరు పెళ్లి పీటలెక్కడం సంసారం చేయడం ఆ తర్వాత విడాకులు చేయడం వెంటవెంటనే జరిగాయి.

Samantha : ఇదే జరిగితే అంతా హ్యాపీ..
అయితే ఈ ఇద్దరు కలిస్తే మళ్లీ చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. రియల్ లైఫ్‌లో ఎలాగు జరగకపోవచ్చు. రీల్ లైఫ్‌లో అయిన జరిగితే బాగుండు అని అందరు అనుకుంటున్నారు. నాగ చైతన్య, సమంత ప్రధాన పాత్రలలో ఏ మాయ చేశావే చిత్రం తెరకెక్కగా, ఈ చిత్రంకి సీక్వెల్‌గా ఓ మూవీ గౌతమ్ మీనన్ చేస్తానని ఎప్పుడో చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ సినిమాకి ముహూర్తం కుదిరినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ఇద్దరితో గౌతమ్ మీనన్ సీక్వెల్ చేయబోతున్నాడని, ఇందులో నటించేందుకు ఇద్దరు నటీనటులు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.