Samantha : టాలీవుడ్ క్వీన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. . ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే ఎనలేని స్టార్డమ్ ను సంపాదించుకుంది. అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా పెళ్లిల్లు అయ్యాక హీరోయిన్లకు సినిమా అవకాశాలు అంతగా రావు. కానీ సమంత మాత్రం అంతకు మించి అన్నట్టు దూసుకుపోతుంది. శాకుంతలం, యశోద చిత్రాలతోపాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అయింది. సమంత లైనప్ చూసి చాలా మంద ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం సమంత ఖుషీ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు యశోద, శాకుంతలం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. అయితే యశోద సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. సామ్ కెరీర్లోనే అత్యంత సవాలుగా ఉన్న చిత్రాలలో ఒకటి కాగా, ఇందులోని పలు యాక్షన్ సన్నివేశాల కోసం సామ్ అసలు వెనకడుగు వేయలేదట. ఈ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్‌మ్యాన్ యాన్నిక్ బెన్ వద్ద శిక్షణ తీసుకుందట. గతంలో ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కోసం బెన్ వద్ద యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుందట.

Samantha : రిస్కీ స్టంట్స్..
యశోద సినిమా కోసం సమంత అత్యంత కఠినమైన ట్రైనింగ్ తీసుకుందని ఇన్సైడ్ టాక్. సమంత డెడికేషన్ చూసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. యశోద చిత్రంలో సమంత ప్రెగ్నెంట్ మహిళగా కనిపించనుంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 11న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.