Senior NTR : ఎన్టీఆర్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తెలుగు వారు ప్రతి ఒక్కరు ఆయన్ని అన్నగారు అనే పిలుస్తారు.ఇక ఆయన నటన స్వభావం గొప్పతనం తెలుగు వారికి తెలియనిది కాదు. అయితే చాలామంది ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాకనే ప్రజలకు సేవ చేశారు అని భావిస్తున్నారు. కానీ నిజానికి అన్నగారు రాజకీయ రంగంలోకి రాకముందు నుండే అంటే సినీ రంగంలో ఉన్నప్పుడు నుండే ప్రజలకు సేవ చేయడం మొదలుపెట్టాడు. సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ఖచ్చితంగా అన్నగారు సహాయం చేసేవారట. ప్రతి సమస్యను తన సమస్యల భావించి ప్రతి ఒక్కరికి అండగా నేనున్నాను అంటూ నిలబడ్డారు. తను సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రతి ఒక్కర కి సహాయం చేసేవారట. ఒకసారి తాను సినిమా లలో బిజీగా ఉన్నప్పుడు ఆగ్ర నిర్మాత సోదరుడికి యాక్సిడెంట్ అయిందట.
ఇంకా ఆ సమయంలో అతనికి బ్లడ్ అవసరమైందట , కానీ బ్లడ్ ఇచ్చేందుకు దాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో కన్ను మూశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అన్నగారు చాలా బాధపడ్డారట. ఈ విషయంపై ఆలోచించి మనమే బ్లడ్ బ్యాంక్ పెడితే ఎలా ఉంటుంది అనుకున్నారట అన్నగారు. పలువురుతో చర్చలు జరిపి విజయ సంస్థ అధినేతను కలుపుకొని అప్పటి మహానటి సావిత్రి సహాయం తో , బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేశాడు ఎన్టీఆర్. ఈ బ్లడ్ బ్యాంకు విజయ సంస్థ స్థలం కేటాయించింది. దీంతో ఆ బ్లడ్ బ్యాంక్ కు విజయ బ్లడ్ బ్యాంక్ అని పేరు పెట్టారు. ఆ బ్లడ్ బ్యాంక్ ఇప్పటికి నడుస్తూనే ఉంది. తర్వాత ఉమ్మడి ఏపీలో 1973లో దివిసీమ తుఫాను వచ్చి అలజడలు సృష్టించింది.

ఆ సమయంలో అన్నగారు అక్కినేని నాగేశ్వరరావుని కలుపుకొని విరాళాలు సేకరించి నష్టపోయిన ప్రజలకు సహాయం చేశారు. వీటితోపాటు తమిళనాడులో తీరప్రాంతాలు మునిగిపోయిన సందర్భంలో కూడా ఎన్టీఆర్ అక్కడి ప్రజలకు తన వంతు సహాయం అందించారట. ఇలా రాజకీయాల్లోకి రాకముందే అన్నగారు అనేక సేవలను అందించారు. వీటితోపాటు సినీ ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేసేందుకు ఒక నిధిని కూడా ఏర్పాటు చేశాడు ఎన్టీఆర్. ఇది కొన్నాళ్లు బాగానే కొనసాగిన తర్వాత కొన్ని ఆర్థికపరమైన తేడాలు రావడంతో దాన్ని రద్దు చేసినట్లుగా సమాచారం. ఇన్ని చేసిన తర్వాత అన్నగారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మరిన్ని సేవలను అందించడం జరిగింది.