Senior NTR : బసవతారమ్మ.. ఈ పేరు గురించి అతి తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే ఆమె ఎక్కువగా బయట కనిపించదు కాబట్టి. భర్త పిల్లలే ఆమె ప్రపంచం. ఆమె ఎవరో కాదు మన స్వర్గీయ నందమూరి నట సార్వభౌముడు తారక రామారావు గారి భార్య. ఈమె షూటింగ్లకు చాలా దూరంగా ఉంటుంది. అచ్చ తెలుగు ఆడపడుచుల తన భర్త చెప్పిన పని తాను చేసుకుంటూ ఉండేది. ఇక ఇప్పుడు ఈమెకు ఉన్న గొప్ప గుణాలు టాలీవుడ్ లోని స్టార్ హీరో భార్యకు ఉన్నాయని జనాలు చెప్పుకొస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ గురించి మనకు తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఆయన ఒక మంచి మనసున్న వ్యక్తి. గొప్ప నటుడు కూడా.
పక్క వాళ్ళు బాధపడితే చూడలేని మనస్తత్వం కలిగినవాడు సీనియర్ ఎన్టీఆర్. అందుకే తెలుగు ప్రేక్షకులు ఈయనను అన్నగారు అనే పిలుపుతో పిలుస్తారు. ఈ పేరుకు తగ్గట్టు ఆయన కూడా తమ ఇంటికి ఎవరైనా వస్తే వారికి కడుపునిండా అన్నం పెట్టకుండా పంపించేవారు కాదు. ఏమాత్రం ఆలోచించకుండా ఎవరికైనా సరేే వండి పెడుతుంది ఎన్టీఆర్ భార్య బసవతారమ్మ. ఎన్టీఆర్ కోసం వచ్చే ఫ్రెండ్స్ అయినా, కథ చెప్పడానికి వచ్చే దర్శకులైన, ఎన్టీఆర్ ని చూడడానికి వచ్చే అభిమానులైన ,ఎవరైనా సరే ఆమె అన్నం పెట్టకుండా పంపించేది కాదట. వారు ఎంతటి స్థాయిలో ఉన్నావారు అయిన ఎలాంటి వారైనా సరే వారికి అన్నం పెట్టి ఆకలి తీర్చిన తర్వాతే పంపిస్తుంది.

ఇక ఇప్పుడు ఇంచుముంచు ఇదే అలవాట్లు టాలీవుడ్ మెగాస్టార్ అయిన చిరంజీవి భార్య సురేఖకు ఉన్నాయట. సురేఖ కూడా బసవతారమ్మ లాగే ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలు చేయకుండా అసలు పంపించదట. ఈ మాట చిరంజీవి ఇంటికి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరు చెబుతారు. ఈ విషయంలో గతంలో స్టార్ హీరోయిన్ అయిన రాధిక రాధా రోజా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మాకు కావాల్సినవన్నీ వండిపెట్టిందని ఇలాంటి మనసున్న ఆమెను మేము ఇంతవరకు చూడలేదు అంటూ చెప్పుకొచ్చారు హీరోయిన్స్. దీంతో ఒకప్పుడు ఎన్టీఆర్ భార్య బసవతారమ్మ ఎంత మంచి పేరు సంపాదించుకుందో ఇప్పుడు సురేఖ కూడా అంతే మంచి పేరు సంపాదించుకుంటుందని చెప్పాలి. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు వీరికి చేతులెత్తి దండం పెడుతున్నారు. అంతటి స్టార్ హీరోల భార్యలైనా సరే గర్వం చూపించకుండా ఇలా వండి పెట్టడం అంటే మామూలు విషయం కాదు మరి.