Prabhas : మహేశ్, పవన్, రజినీకాంత్ వీళ్ళెవ్వరూ టచ్ చేయలేరు.. ప్రభాస్ యుద్ధం ఎవరితోనో తెలుసా?

Advertisement

Prabhas : పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ కు చెందిన యాక్టర్ మాత్రమే కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో. అవును.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో టాప్ హీరో స్థానాన్ని ఆక్రమించేసు కున్నాడు ప్రభాస్. అందుకే.. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ ప్రభాస్ అంటున్నారు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ డైరెక్టర్లతోనే సినిమాలు తీసేస్తున్నాడు ప్రభాస్. అయితే.. 2022 ప్రభాస్ కు అంతగా అచ్చి రాలేదు. ఆయన నటించిన రాధేశ్యామ్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది.  ఇక.. 2022 లో ప్రభాస్ సినిమాలు ఇంకేవీ విడుదల కావు. 2023 లో మాత్రం ప్రభాస్ మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

Advertisement

అవును.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ప్రభాస్ మూడు సినిమాలు వచ్చే సంవత్సరం రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు బాలీవుడ్ కింగ్ కాన్ షారుఖ్ ఖాన్ వి కూడా మూడు సినిమాలు వచ్చే సంవత్సరమే విడుదల కాబోతున్నాయి. దీంతో బాలీవుడ్ లో ప్రభాస్ వర్సెస్ కింగ్ కాన్ షారుఖ్ ఖాన్ అన్నట్టుగా ఉంది.నిజానికి ప్రభాస్.. జెట్ స్పీడ్ లో సినిమాలు తీస్తున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే మూడు సినిమాలు ఇప్పుడు లైన్ లో ఉన్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. కానీ.. ఆ టీజర్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అదేం యానిమేషన్ అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు.

Advertisement
shah rukh khan and prabhas movies to released in 2023
shah rukh khan and prabhas movies to released in 2023

Prabhas : జెట్ స్పీడ్ లో సినిమాల్లో నటించేస్తున్న ప్రభాస్

ఆ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఇక.. 2023 చివర్లో ప్రాజెక్ట్ కే విడుదల కానుంది. మొత్తానికి 2023 ప్రభాస్ నామ సంవత్సరంగా మారనుంది. మూడు సినిమాలు ఒకే సంవత్సరం విడుదల అవుతుండటంతో ప్రభాస్ అభిమానులు మొత్తానికి సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. వచ్చే సంవత్సరం షారుఖ్ ఖాన్ మూవీలు కూడా మూడు విడుదల కాబోతున్నాయి. అందులో సంక్రాంతి కానుకగా పఠాన్ రానుంది. ఆ తర్వాత డుంకీ సినిమా రానుంది. డిసెంబర్ లో మరో సినిమా రానుంది. మొత్తానికి ప్రభాస్, షారుఖ్ ఖాన్.. 2023 ను దత్తత తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. మరి వీళ్ల వార్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement