Siri Hanumanth : బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడిప్పుడే హాట్ హాట్‌గా మారుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, కొందరిపై నోరు జారడం కూడా చేస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అడవిలో ఆట టాస్క్ లో.. పోలీసుల టీమ్ నుంచి ఆది రెడ్డి, ఫైమా.. దొంగల టీమ్ నుంచి శ్రీహాన్ తో పాటు శ్రీసత్య, గీతూ రాయల్ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయ్యారు. అయితే వీరికి రెండు దశల్లో బ్రిక్స్ టాస్క్ ఇవ్వగా, దానికి సంచాలకుడిగా సింగర్ రేవంత్ ను నియమించారు.ఈ టాస్క్‌లో రేవంత్ శ్రీహాన్‌కి సపోర్ట్‌గా ఉన్నట్టు తేలడంతో ఇనయ రెచ్చిపోయి దారుణమైన కామెంట్స్ చేసింది.
టాస్క్‌లో భాగంగా బ్రిక్స్ ను పేర్చడంలో శ్రీ సత్య, ఆది రెడ్డి, శ్రీహాన్, ఫైమా గేమ్ ఆడతుండగా, బ్రిక్స్ ను కాపాడుకునే క్రమంలో ఫైమా చేతులు బ్రిక్స్ కి తగలడంతో ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు రేవంత్. ఆ సమయంలో ఇనయ తన వాదన వినిపించింది . శ్రీహాన్ చేతి కూడా బ్రిక్స్ కు తగిలిందని , దాన్ని రేవంత్ ఒప్పుకోడు అని చెప్పుకొచ్చింది. అయితే ఇంతలోనే వచ్చిన శ్రీహాన్.. ‘ఏ పిట్ట నీ దగ్గరికి వచ్చి ఏం కూసిన సంచాలక్ గా నీ నిర్ణయం నువ్ తీసుకో’ అని చెప్పడంతో, పిట్ట అని ఎలా అంటావ్.. అంటూ శ్రీహాన్ పై ఫైర్ అయింది. తర్వాత శ్రీహాన్ కూడా ‘నేను నిన్ను అనలేదు.. నీ పేరు పెట్టలేదు’ అంటూ గట్టిగానే వాదించాడు.

Siri Hanumanth : నోరు జారిందా..
ఈ గొడవలో అనవసరంగా బ్యాడ్ అవ్వకు అని శ్రీహాన్‌ని పక్కకు తీసుకెళ్లగా, మధ్యలో గీతూ రాయల్ దూరి ఆ పిట్ట అని తననే అన్నాడు అనుకుంటూ రెచ్చిపోతుంది. ఒక అమ్మాయిని అలా అనడం, దాన్ని మరో అమ్మాయి అయినా గీతూ రాయల్ సపోర్ట్ చేయడం, మిగతా లేడీ కంటెస్టెంట్లు జోకులు వేసుకోవడం దారుణంగా అనిపించింది. అయితే కోపంలో శ్రీహాన్ ని.. మగాడివేనా అని ఇనయ అన్నట్టు తెలుస్తుంది. దీని గురించి ఇంటి సభ్యులు చర్చించుకుంటుండగా, ఈ విషయంపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో అని వారు ముచ్చటించుకోవడం కొసమెరుపు.