Mahesh Babu Daughter : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో తనకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ స్టార్ కూతురులా కాకుండా తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో అందరినీ కనువిందు చేస్తూ అభిమానులను సంపాదించుకుంది సితార. ఇక ఈ మధ్యన సితార నాయనమ్మ అయిన ఇందిరా దేవి చనిపోవడంతో తను ఎంత బాధపడిందో మనందరికీీ తెలుసు. ఆ సమయంలో తన నాయనమ్మ కోసం సితార విలపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇక ఇప్పుడు సితార తీసుకుని ఒక నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గాా మారింది.
ఇంత చిన్న వయసులో ఆమె తీసుకున్న నిర్ణయానికి అందరూ చేతులెత్తి దండం పెట్టాల్సిందే.సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలుసు. ఇప్పటివరకు వేయికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించాడు. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే కచ్చితంగా వారిని ఆదుకుంటాడు. ఈ తరహా ఆలోచన మహేష్ బాబుకు తన తండ్రి కృష్ణ నుంచి వచ్చిందని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇదే తరహాలో సితార కొనసాగుతుంది. తాతకు తగ్గ మనవరాలు తండ్రికి తగ్గ బిడ్డ అనిపించుకుంటుంది సితార.ఇక ఇప్పుడు సితార తన నాయనమ్మ పేరు మీదుగా ప్రతిరోజు వెయ్యి మందికి అన్నదానం చేసేటట్లుగా ప్లాన్ చేసుకుందట. తన నాయనమ్మ మీద ఉన్న ప్రేమతో ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

ఇక దీనికోసం అయ్యే ఖర్చును సితార మహేష్ బాబును కానీ సూపర్ సార్ కృష్ణను కానీ ఒక్క రూపాయి కూడా అడగలేదట . సోషల్ మీడియా ద్వారా తనకు వస్తున్న సంపాదనతోనే ఇదంతా చేయాలనుకుంటుందట సితార.ఇక ఈ కార్యక్రమానికి తన అన్నయ్య గౌతమ్ కూడా సహకరిస్తున్నాడు. ఇంత చిన్న వయసులో వీరికి ఇలాంటి ఆలోచన రావడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ మరింత సంతోష పడుతున్నారు. తల్లిదండ్రులను చూసి పిల్లలు ఎదుగుతారు అని పెద్దలు ఊరికే అనలేదు మరి.