Sneha : సీనియర్ హీరోయిన్ స్నేహ వయసు పెరిగిన కొద్దీ తన అందాన్ని కూడా పెంచుకుంటుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది ఈ బ్యూటీ. స్నేహ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దపెద్ద స్టార్స్ పక్కన నటించి తెలుగు ఫ్యామిలీ ఆడియోస్ కు బాగా దగ్గరయింది. పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయి లక్షల మంది అభిమానుల గుండెలో చెరగని ముద్రను సంపాదించుకుంది.
అప్పట్లో స్టార్ హీరోయిన్ గా అందరి హీరోల పక్కన నటించి క్రేజ్ ను సాధించింది స్నేహ. ఇక ఇప్పటి ఆధునిక కాలంలో కూడా తన అభిమానులకు దగ్గరగా ఉండాలని తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంటర్నెట్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇటీవల స్నేహ పట్టుచీర కట్టుకొని అచ్చమైన తెలుగు అమ్మాయిల అందాలను వలకబోస్తూ గోల్డ్ కలర్ శారీలో మెరిసింది. క్రేజీగా ఫోటోలను దిగి వాటిని ఇంటర్నెట్లో పోస్ట్ చేసి ఫ్యామిలీ బ్యూటీగా మార్క్ ను సంపాదించుకుంది. మతిపోయే పోజులతో , మత్తు చూపులతో కుర్రకారులను సైతం తన వైపు తిప్పుకుంటుంది. ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ జనరేషన్ అమ్మాయిలు కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు జనాలు. ఇక నార్త్ కు చెందిన స్నేహ సౌత్ లోనూ తన పేరును నిలబెట్టుకుంది. ఇప్పటికీ తెలుగు , తమిళ్ , మలయాళం ,సినిమాలో విభిన్న పాత్రలను చేస్తూ అలరిస్తుంది. తెలుగులో చివరగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ” సినిమాలో హీరో వదినగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తెలుగు తమిళ్ మలయాళం సినిమాలో నటిస్తూనే ఇటు టీవీ షో లతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది స్నేహ.