Savitri – Sr NTR : మహానటి సావిత్రి మహానటుడు ఎన్టీఆర్ ఈ పేర్ల గురించి తెలియని తెలుగు వారు ఉండరు కాబోలు. అప్పట్లో వీరు ఒక ప్రభంజనం. ఇక వీరిద్దరూ కలిసి తీసిన సినిమాలు అప్పట్లో 100 రోజులు ఆడేవి. అలగే ఒక సంవత్సరం ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. పౌరాణికం మరియు కుటుంబ కథా సినిమాలు అయితే రెండు సంవత్సరాలకు పైగా ఆడిన సినిమాలు ఉన్నాయి. అప్పట్లో వీరిద్దరూ కలిసి తీసిన సినిమాలకు అంత డిమాండ్ ఉండేది మరి. వీరిద్దరూ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక అప్పట్లో ఎన్టీఆర్ అంటే అందరికీ చాలా అభిమానం. అందుకే ఆయనను ఎక్కువగా అన్నగారు అనే పిలుస్తారు.
ఇక అన్నగారు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించేవారిలో గుమ్మడి తర్వాత మహానటి సావిత్రి. అయితే అన్నగారు కొన్నాళ్లు హీరోగా నటించిన తర్వాత దర్శకుడుగా మారారు. ఇక అన్నగారి దర్శకత్వంలో మహానటి సావిత్రి చాలా సినిమాలలో నటించింది. ఇక ఈ క్రమంలో సావిత్రి కూడా దర్శకురాలిగా మారెందుకు ముందుకు వచ్చారట. ఇక విషయంపై అన్నగారి సలహా అడగగా అన్నగారు ఇది చాలా ప్రయాసతో కూడిన వ్యవహారం అని చెప్పి , సావిత్రిని నిర్మాతగా ఉండమని సూచించారట. అన్నగారి మాట ప్రకారం మహానటి సావిత్రి నిర్మాతగా ,రెండు సినిమాలలో పనిచేశారు పనిచేశారు. అవి రెండు సినిమాలు తమిళ్ సినిమాలు ఇక ఆ రెండు సినిమాలు సావిత్రికి ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

దీంతో ఆమె మళ్లీ నటించవలసి వచ్చిందట. ఈ విషయాన్ని ఒక సందర్భంగా అన్నగారితో పంచుకుంది సావిత్రి. అలాగే మీరు చెప్పినట్లు చేయడం వల్ల నా చేతులు కాల్చుకున్న అని కూడా అన్నారట. దానికి అన్నగారు ఎవరి అదృష్టం వారిది అనడంతో సావిత్రి హర్ట్ అయ్యారట. ఇక ఆ తర్వాత నుండి సావిత్రి దర్శకురాలుగా తన ప్రతిభను చూపించారు. ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కూడా బాగానే ఆడేవి. అన్నగారి మాట వలనే నిర్మాతగా వెళ్లి నష్టపోయిందని లేకుంటే ఇలా జరిగిండే కాదని అప్పట్లో సావిత్రి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆమె నిజ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని చివరగా కనుమూశారు సావిత్రి.