Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఇటీవలి కాలంలో అందాల డోస్ పెంచి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. తన క్యూట్ అందాలతో మెంటలెక్కిస్తుంది. చాలా కాలం క్రితమే నటిగా ప్రయాణం మొదలు పెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ఉంది. ఇలా చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా.. శ్రీముఖి సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేసింది. అయితే ఇందులో శ్రీముఖి స్టన్నింగ్ లుక్స్ క్యూట్‌గా ఉన్నాయి. లూజ్ లూజ్ దుస్తులలో శ్రీముఖిని చూసి అందరు స్టన్ అవుతున్నారు.
టీవీల్లో ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లోను అదరగొడుతోంది శ్రీముఖి.. అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది. శ్రీముఖి ఏ షో చేసిన తన అల్లరితో కేక పెట్టిస్తోంది. చలాకీ మాటలతో వావ్ అనిపిస్తుంది. శ్రీముఖిని ఆమె ఫ్యాన్స్ ముద్దుగా బుల్లితెర రాములమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు చేతి నిండా టీవీ షోలు, ఈవెంట్లతో తీరిక లేకుండా గడుపుతోన్న శ్రీముఖి సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడు తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటుంది.

Sreemukhi : క్యూట్ లుక్స్..
ఇక అది అలా ఉంటే శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోన్న అయితే శ్రీముఖి వాటిపై ఇంక స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే కాలమే సమాధానం చెప్పాలి. అయితే మొన్నటి వరకు కాస్త ఆచితూచి అందాలు ఆరబోసిన శ్రీముఖి ఇటీవల మాత్రం గ్లామర్ డోస్ భారీగా పెంచుతూ రచ్చ చేస్తుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.