Sri Reddy : రానా త‌మ్ముడికి ఏం చేత కాదంటూ శ్రీ రెడ్డి అంత మాట అనేసింది ఏంటి?

Advertisement

Sri Reddy : ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండ‌డంతో పాటు ప‌లు విష‌యాల‌పై స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ద‌గ్గుబాటి సురేష్ బాబు త‌న‌యుడు అభిరామ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.గ‌తంలో శ్రీరెడ్డి.. అభిరామ్ ఫొటోలు లీక్ చేయ‌డ‌మే కాక అభిరామ్ తనను వాడుకున్నాడని, అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పి సర్వం దోచుకున్నాడని, అవసరాలు తీరాక తనను వదిలేశాడంటూ శ్రీ రెడ్డి కొన్ని ఆరోపణలు చేసింది.

Advertisement

శ్రీ రెడ్డి ఎపిసోడ్ వల్లే అభిరామ్ వార్తల్లో వైరల్ అయ్యాడు. అభిరామ్ త్వ‌ర‌లో తేజ తెర‌కెక్కించిన అహింస సినిమాతో ప‌ల‌క‌రించ‌నుండ‌గా,ఈ సినిమాకి సంబంధించి శ్రీరెడ్డి మాట్ల‌డుతూ.. గాలి తీసేసింది. అహింసనా? నేను అస్సలు వినలేదు.. అయినా వాడికి హింస తప్ప ఇంకేం రాదు.. అహింస అనే సినిమాతో వస్తున్నాడా? అన్న టైపులో కౌంటర్లు వేసింది. వస్తే రానివ్వండి.. చాలా సినిమాలు వస్తున్నాయ్.. పోతోన్నాయ్.. ఇది ఏ మాత్రం అడుతుందో చూద్దాం అన్నట్టుగా వెటకారంగా కామెంట్లు వేసింది. శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Advertisement
sri reddy fires on ahimsa hero
sri reddy fires on ahimsa hero

Sri Reddy : ప‌రువు తీసింది..

ఆమె ఇటీవ‌ల యూట్యూబ్ వీడియోలు ఎక్కువ‌గా షేర్ చేస్తూ వార్త‌లలో నిలుస్తుంది. ఇదిలా ఉంటే నటి శ్రీరెడ్డి లైగర్ సినిమాపై స్పందించింది. ఈ సినిమాలో అసలు కంటెంటే లేదని… కంటెంట్ లేని సినిమాకు ఇంత హైప్ అవసరమా? అని ఎద్దేవా చేసింది. అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై శ్రీరెడ్డి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీసేవన్నీ ఫ్లాప్ సినిమాలేనని… అయినా, మహేశ్ బాబు డేట్స్ ఇవ్వడం లేదని చెప్పడం ఏంటో అని విమర్శించింది. మహేశ్ డేట్స్ ఇవ్వలేదని ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. ఈ అమ్మ‌డు కాంట్ర‌వ‌ర్సీల‌తో నే కాపురం చేస్తుండ‌డం విశేషం.

Advertisement