Sri Reddy : తనకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా స్పందిస్తుందేమో కానీ.. నచ్చిన వారిపై ఈగ వాలిందన్నా అరక్షణం ఆలోచించదు నటి శ్రీ రెడ్డి. ఎంత మంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నా కూడా శ్రీ రెడ్డి స్పెషాలిటీ వేరు. తాను ఎప్పుడు కాంట్రవర్సీస్తోనే కాలం గడుపుతుంటుంది.కాస్టింగ్ కౌచ్ అంటూ అప్పట్లో నానా హంగామా చేసిన శ్రీ రెడ్డి ప్రముఖుల గురించి ఇష్టమొచ్చిన కామెంట్స్ చేసి ఇక్కడ నుండి బహిష్కరించబడింది. దాంతో చెన్నై వెళ్లి అక్కడ తెగ వీడియోలు చేస్తుంది. ముఖ్యంగా వంటలకు సంబంధించిన వీడియోలు చేస్తూ రచ్చ చేస్తుంది.
తాజాగా చేపల కూర వండిన ఈ అమ్మడు అందాలన్నీ అప్పనంగా ఆరబోస్తూ రచ్చ చేసింది. శ్రీరెడ్డి వంటల వీడియో ఇప్పుడు హాల్ చల్ చేస్తుంది. తాత కలిసి టేస్టీ చేపల కూర వండిన శ్రీరెడ్డి అందాలని కూడా గట్టిగానే దట్టించింది. బాబోయ్ శ్రీరెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు కూడా ఉండడం లేదు. తాతతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెబుతూ నానా రచ్చ చేస్తుంది శ్రీ రెడ్డి. సినిమాలు లేక ఇబ్బందులు పడుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.

Sri Reddy : తెగ ఆరబోస్తుందిగా..
అప్పుడు శ్రీ రెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. దీంతో బాగా పాపులారిటీని అందుకుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఓ పార్టీ కోసం కార్యకర్తగా మారిపోయింది. అప్పటి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సపోర్టు చేస్తూ పోస్టులు చేస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థులపైనా విమర్శలు చేస్తోంది. ఆ పార్టీకి సంబంధించి ఎవరైన ఏదైన కామెంట్ చేస్తే శ్రీరెడ్డి రెచ్చిపోయి విమర్శలు కురిపిస్తుంది. శ్రీ రెడ్డి ఆరోపణలకి పక్కోళ్ల దెబ్బకు సైలెంట్ కావల్సిందే. ప్రస్తుతం శ్రీ రెడ్డి యూట్యూబ్ ద్వారా ఆరు నుండి 7 లక్షల వరకు సంపాదిస్తుంది.