Sri Reddy : కాస్టింగ్ కౌచ్తో అందరి నోళ్లలో నానిన అందాల ముద్దుగుమ్మ శ్రీరెడ్డి. అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా, యూట్యూబ్ పుణ్యమా అని ఫేడ్ అవుట్ అయినా…. చేతి నిండా సంపాదిస్తున్నారు. అలా యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్న వారిలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా ఉన్నారు. నిజానికి శ్రీరెడ్డికి ముందు నుండి కూడా పెద్దగా ఆఫర్ లు వచ్చింది లేదు. ఏదో అడపాదడపా సినిమాలు చేసింది కానీ అవి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో. కాస్టింగ్ కౌచ్తోనే ఈ అమ్మడు ఫుల్గా క్రేజ్ సంపాదించుకుంది. చెన్నైకి మకాం మార్చి అక్కడే వెబ్ సిరీస్ లు సినిమా అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తోంది.
మరో వైపు సినిమాలు రాజకీయాలు, సామాజిక అంశాలు ఇలా ఏ టాపిక్ నూ వదలకుండా తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది. అందుకోసం శ్రీరెడ్డి ఓ యూట్యూబ్ చానల్ ను కూడా ప్రారంభించింది. వీలున్నప్పుడు వంటలు చేయడం..తన బ్యూటీ సీక్రెట్ లు చెప్పడం తన బాత్రూం ఎలా ఉంది. అందులో ఏం ఉన్నాయి అనేది చూపించడం లాంటివి కూడా చేస్తోంది. ఆస్తుల చిట్టా గురించి కూడా విప్పింది. శ్రీరెడ్డి ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ మాములుగా లేదనే చెప్పాలి. వంటల వీడియోల ద్వారా బాగా సంపాదిస్తుంది కూడా. రీసెంట్గా శ్రీరెడ్డి చికెన్ కూర వండి మంచిగా పక్కన కల్లు పెట్టుకొని చికెన్ కూర లాగించింది. ఇందుకు సంబంధించిన వీడియో హల్చల్ చేస్తుంది.

Sri Reddy : కుమ్మేసింది..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో కబుర్లు చెబుతూ కనువిందు చేస్తుంది. రాజకీయం, సినిమా టాపిక్ ఏదైనా తన స్టైల్లోనే జవాబిస్తుంది.. ప్రశ్నిస్తుంది… తిట్ల దండకం కూడా అందుకుంటుంది. తను సొంతంగా శ్రీరెడ్డి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి హోం టూర్, బెడ్ రూమ్ టూర్ లతోపాటు వంటలు చేస్తూ అందాలను కొసరుగా వడ్డిస్తుంది. వంటలు నేర్పిస్తూ పల్లెటూరి చీరకట్టులో అందాలను వడ్డిస్తే ఆ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత సినిమాల్లోని జయమాలినీ, జ్యోతి లక్ష్మిలు గుర్తుకు తెస్తూ ఈ అమ్మడు చేసే రచ్చ మాములగా ఉండడం లేదు.