Sridevi Drama Company : ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ వారం వారం తగ్గుతుంది. సుడిగాలి సుధీర్ వెళ్లి పోయిన తర్వాత రష్మీ యాంకర్ గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఒక్క వారం రేటింగ్ పర్వాలేదు అన్నట్లుగా వచ్చింది, కానీ ఆ తర్వాత నుండి రేటింగ్ తగ్గుతూనే ఉంది. పుండుమీద కారం అన్నట్లుగా శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి ఓనర్ గా పిలవబడే ఇంద్రజ కూడా వెళ్ళి పోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీకి అత్యంత కీలకమైన తల్లి కొడుకులు అని చెప్పుకునే ఓనర్ ఇంద్రజ మరియు ఆమె కొడుకు సుడిగాలి సుధీర్ వెళ్లి పోవడంతో షో కి కల తప్పినట్లు అయిందంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ సుడిగాలి సుధీర్ మరియు ఇంద్రజ ఉన్నప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో.. ఎంత చూడముచ్చటగా ఉండేదో..
ఇప్పుడు అంతా అంద విహీనంగా తయారయింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు పల్సర్ బండి ఝాన్సీ వంటి వారు వచ్చి సందడి చేసే ప్రయత్నం చేసినా కూడా అప్పటికప్పుడు వరకే శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి ప్రచారం జరుగుతుంది తప్పితే లాంగ్ టర్మ్ లో ప్రచారమైతే జరగడం లేదు. సుడిగాలి సుధీర్ ని ఎలాగో తీసుకు రాలేరు కనుక యాంకర్ రష్మీ నే ఉంచి జడ్జ్ ప్లేస్ లో ఇంద్రజా ని కూర్చోబెడితే బావుంటుంది అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఒకేసారి జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లకు జడ్జిగా వ్యవహరించడానికి ఆమెకు సాధ్యం అవడం లేదట. చెన్నై నుండి అప్ అండ్ డౌన్ చేస్తున్న ఆమెకు డేట్లు కుదరక పోవడం వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీని వదులుకోవాల్సి వచ్చిందట.

ఇంద్రజ ఇష్టం లేకుండానే శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి బయటకు వచ్చేసింది, జబర్దస్త్ లో పూర్తి స్థాయి జడ్జ్ గా సెటిల్ అయిపోయింది. జబర్దస్త్ లో ఎవరైనా జడ్జ్ గా ఉంటే పర్వాలేదు గానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం కచ్చితంగా ఇంద్రజ ఉండాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇంద్రజ లేని శ్రీదేవి డ్రామా కంపెనీ ఏమాత్రం ఆకట్టుకోవడం లేదంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ లో మరెవరైనా జడ్జిని కూర్చోబెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంద్రజాన్ని తీసుకు రావాలంటూ మల్లెమాల వారికి చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఇంద్రజా ను వాళ్ళు తీసుకొస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీకి మళ్లీ పూర్వపు రోజులు వస్తాయా? అనేది చూడాలి.