Srihari Wife : విలక్షణ నటుడు శ్రీహరి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎంతోమంది నటీనటులను దర్శకులను పరిచయం చేసిన లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు బ్రహ్మ నాయుడు అనే చిత్రం ద్వారా శ్రీహరిని నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఉన్నట్టుండి కాలేయం సంబంధిత వ్యాధి బారిన పడ్డ శ్రీహరి, కొన్నాళ్లకు కన్నుమూసాడు. ఆయన మృతితో సిని పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఇటీవల డిస్కోశాంతి తన భర్త మరణం గురించి మాట్లాడుతూ..
శ్రీహరి, నేను ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఆర్ రాజ్ కుమార్ సినిమా కోసం ముంబై వెళ్ళాం. ముంబైలో షూటింగ్ పూర్తి చేసుకుని ఉదయం 3 గంటల సమయంలో హోటల్ కి వచ్చాడని, ఆ సమయంలో కొద్దిగా టిఫిన్ చేసి పడుకున్నాడని, ఆ తర్వాత ఉన్నట్టుండి కడుపులో నొప్పి వస్తుందని అరిచేశాడని అంది. ఆ సమయంలో నర్స్ ఏదో సెలైన్ ఎక్కించగా, ఆయన పరిస్థితి విషమంగా మారిందని పేర్కొంది. మాకు రెమ్యునరేషన్స్ కరెక్ట్‌గా వచ్చుంటే నేను మరో 10 ఇళ్లు కొని ఉండేదాన్ని. బావ (శ్రీహరి) చనిపోయిన తర్వాత ఇప్పుడున్న ఇంటిపై అప్పులుంటే నగలు, కార్లు అమ్మేసి తీర్చేశాను.

Srihari Wife : దారుణం..
చిరంజీవిగారి సంస్థ సహా మరో రెండు, మూడు సంస్థలే శ్రీహరిగారికి రెమ్యునరేషన్‌ను కరెక్ట్‌గా ఇచ్చారు. చాలా మంది డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. సినిమాలంటే బావకి పిచ్చి. ఓ సారి బాలకృష్ణగారు ఫోన్ చేసి ‘శాంతిగారు ఇలా శ్రీహరిగారు మా సినిమాలో ఓ క్యారెక్టర్ చేశారు. దానికి సంబంధించి ఏమైనా డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయా!. ఏమైనా సాయం కావాలా’ అని అడిగారు. బావ చనిపోయిన తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాలకృష్ణలా ఎవరూ కాల్ చేసి అడగలేదంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది డిస్కోశాంతి.