Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే నాలుగు వారాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ లో నాలుగు వారాల్లో నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం ఎవ్వరినీ ఎలిమినేట్ చేయలేదు కానీ.. రెండో వారంలో షానీ, అభినయశ్రీని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. మూడో వారం నేహా చౌదరి, నాలుగో వారం ఆరోహీ రావును ఎలిమినేట్ చేశారు. అయితే.. హౌస్ లో ప్రస్తుతం ఎవరు టాప్ లో ఉన్నారు అని చెప్పాలంటే నిర్మొహమాటంగా అందరూ శ్రీసత్య అని చెబుతున్నారు.
ఎందుకంటే.. తను ఆడే ఆటను చూసే చెప్పొచ్చు. తను చాలా స్పోర్టివ్ గా గేమ్ ఆడుతూ రోజురోజుకూ టాప్ పొజిషన్ లోకి చేరుకుంటోంది. అయితే.. ఓర్మాక్స్ అనే ఓ మీడియా కంపెనీ ప్రతి వారం కూడా టాప్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా సర్వే నిర్వహించింది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ కంటెస్టెంట్ల జాబితాను తాజాగా సంస్థ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల జాబితాను విడుదల చేసింది. అందులో టాప్ ఫైవ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో రేవంత్ ఉండగా, రెండో స్థానంలో శ్రీహాన్, మూడో స్థానంలో శ్రీసత్య నిలిచింది. నాలుగో స్థానంలో చలాకీ చంటి, ఐదో స్థానంలో ఫైమా నిలిచింది.

Bigg Boss 6 Telugu : టాప్ ఫైవ్ లో గీతూ ఎందుకు లేదు?
టాప్ ఫైవ్ లో ఉన్నవాళ్లు ఓకే కానీ, టాప్ 5 లో అసలు గీతూ ఎందుకు లేదు అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గీతూ మొదటి నుంచి టాప్ లోనే ఉంటూ వస్తోంది. తన వల్లనే బిగ్ బాస్ హౌస్ లో కాస్తో కూస్తో ఫన్ జనరేట్ అవుతోంది. మరి.. గీతూకు ఈ వారం ఎందుకు టాప్ ఫైవ్ లో చోటు దక్కలేదు అనేది తన అభిమానులకు అర్థం కావడం లేదు. టాప్ ఫైవ్ లో గీతూ లేకపోవడం పక్కన పెడితే, గత వారం శ్రీసత్య నెంబర్ వన్ స్థానంలో ఉండగా ఈ వారం మూడో స్థానంలో నిలిచింది. బిగ్ బాస్ హౌస్ లో అసలు ఆటే ఆడని చలాకీ చంటి మాత్రం టాప్ ఫైవ్ లోకి ఎలా వచ్చాడు అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.