SS Rajamouli : పొన్నియన్ సెల్వన్ అనే మూవీ గురించి ప్రస్తుతం భారతదేశం మొత్తం మాట్లాడుకుంటోంది. నిజానికి ఇది ఒక తమిళ్ మూవీనే. కానీ.. ఈ సినిమాను అందరూ బాహుబలి సినిమాతో పోల్చుతున్నారు. ఎందుకంటే ఇది కూడా భారీ బడ్జెట్ మూవీ. దసరా కానుకగా ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. అయితే.. ఈ సినిమా డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్. చాలా ఏళ్లుగా ఈ సినిమా కోసం మణిరత్నం కష్టపడుతున్నారు. దానికి తగ్గ ఫలితం ఇప్పుడు రాబోతోంది. ఇంకొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
ఈ సినిమాలో చాలామంది బిగ్ స్టార్స్ నటించారు.అయితే… ఈ సినిమా గురించి తెలుసుకున్న రాజమౌళి ఓ విషయంలో షాక్ అయ్యారట. ఆ విషయాలను చెప్పింది ఈ సినిమాలో ఓ పాత్రలో నటించిన జయం రవి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జయం రవి.. ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. పొన్నియన్ సెల్వన్ సినిమా రెండు పార్ట్స్ షూటింగ్ ను కేవలం 150 రోజుల్లోనే మణిరత్నం పూర్తి చేశారని చెప్పకొచ్చాడు జయం రవి.150 రోజుల్లో రెండు పార్ట్స్ పూర్తి చేయడం అనేది చాలా కష్టం. అందులోనూ ఇది చరిత్రకు సంబంధించిన సినిమా.

SS Rajamouli : రాజమౌళి కూడా మణిరత్నాన్ని ఈ విషయం గురించి ఆడిగారు
ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి కూడా ఆశ్చర్యపోయారట. ఇంత భారీ సినిమాను అందులోనూ రెండు పార్ట్స్ ను కేవలం 150 రోజుల్లో ఎలా పూర్తి చేయగలిగారు అని మణిరత్నాన్ని రాజమౌళి అడిగారని జయం రవి చెప్పుకొచ్చాడు. ఇక.. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్ లాంటి భారీ తారాగణం నటించారు. అందుకే ఈ సినిమా భారీ మల్టీస్టారర్ గా మారిపోయింది. అలాగే ఈ సినిమా కోసం రూ.400 కోట్లు ఖర్చుపెట్టారట. సుమారు రూ.1000 కోట్ల వసూళ్లు రావాలనే లక్ష్యంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 30 న ఈ పొన్నియన్ సెల్వన్ మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.