SS Thaman : తెలుగు ప్రేక్షకులను అమితంగా ప్రభావితం చేసే అంశాలు మూడు .ఒకటి రాజకీయం, రెండవది సినిమా, మూడోది క్రికెట్.అంతటి ప్రభావితం చూపే రంగాలలో పనిచేసే వారికి కాస్త ఒత్తిడి ఉంటుందనే చెప్పాలి. ఈ రంగాలలో ఎంత ప్రతిభ ఉన్నా సరే ఫలితం లేకపోతే మాత్రం చాలా కష్టం. ఒక సినిమా రంగానికి సంబంధించి ఎంత టాలెంట్ ఉన్నా సరే సక్సెస్ లేకుంటే ప్రయోజనం ఉండదు. అలాగే రంగాలలో సెంటిమెంట్లు చాలా ఉంటాయి. అలాంటి ఒక విషయమే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మ్యూజిక్ తో ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడు. అయితే ఇతనికి ఒక సెంటిమెంట్ ఉందట.
తాను మొదటిసారి పనిచేసే హీరోల సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయని చెప్తున్నాడు తమన్. తాజాగా ఆ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయింది చెబుతున్నాడు తమన్ . తను ఇటీవల చేసిన “గాడ్ ఫాదర్” సినిమా సూపర్ హిట్ అయింది. ఇక తమన్ మెగాస్టార్ తో పనిచేయడం ఇదే మొదటిసారి. దీంతో తమన్ తన సెంటిమెంట్ మళ్లీ నిజమైంది అంటూ చెప్పుకొచ్చారు . అలాగే మ్యూజిక్ స్కోప్ లేని సినిమాలో నా మ్యూజిక్ సక్సెస్ కావడం తో చాలా హ్యాపీగా ఉన్నానని అలాగే లండన్ లోని అబేయి రోడ్ స్టూడియోలో రికార్డ్ చేసిన తొలి భారతీయ చిత్రం “గాడ్ ఫాదర్” అని పేర్కొన్నాడు తమన్.

ఇంక తన ఆరేళ్ల వయసులో తన తల్లితో కలిసి కోటిగారి రికార్డింగ్ స్టూడియో కు వెళ్లగా అక్కడ చిరంజీవి గారి అందం హిందోళం పాట రికార్డింగ్ జరుగుతుందని…. ఆ పాట విన్న తర్వాత తను చిరంజీవి ఫ్యాన్ అయిపోయినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక అప్పటినుంచి ఇంట్లో ఆయన పాటలకే వాయిస్తూ ఉండేవాడినని ఇప్పుడు ఆయనతో కలిసి ,పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు తమన్. ఏది ఏమైనా గాడ్ ఫాదర్ మూవీతో మళ్లీ తన సెంటిమెంట్ నిజమైంది అన్న ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు తమన్. దీంతో తమన్ తో ఇప్పటివరకు సినిమాలు చేయని హీరోలు తనతో కలిసి పనిచేసి బ్లాక్ బాస్టర్ కొడదామని చూస్తున్నారట.