Star Director : చాలా రోజుల తర్వాత అల్లు శిరీష్ సరికొత్త కథతో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ నటించనుంది. ఇక ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమాలో వీరిద్దరి రొమాన్స్ వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి అను ఇమ్మానుయేల్ వెళ్ళింది. ఈ క్రమంలో అను ఇమ్మానుయేల్ సినిమా లొని కొన్ని సినీ సంగతులను పంచుకుంది. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు శిరీష్ మరియు ఇమాన్యుల్ డేటింగ్ లో ఉన్నారని వార్తలు కూడా వినిపించాయి.
అయితే ఆ వార్తలు వాస్తవం కాదని తెలియజేసింది అను ఇమాన్యుయల్. ఈ రూమర్ అటు తిరిగి ఇటు తిరిగి తన చెవిలో కూడా పడిందని ఆ గాసిప్ విన్న వాళ్ళ అమ్మ గారు చాలా బాధపడ్డారని తెలిపింది. అయితే వాస్తవానికి అను అంతకు ముందు వరకు అల్లు శిరీష్ ని ఎప్పుడు కలవలేదట. శిరీష్ ని ఫస్ట్ టైం ,ఊర్వశివో రాక్షసివో మూవీ పూజ రోజు కలిశానని, ఆ తర్వాత సినిమా కథ , గురించి మాట్లాడుకోవడానికి ఒక కాఫీ షాప్ లో కలిసామని అంతకంటే ఎక్కువ ఏం లేదని తెలియజేసింది. వారు అలా కాఫీ షాప్ లో కలవడమే ఆ రూమర్ కి దారితీసి ఉంటుందని అను ఇమ్మానుయేల్ తెలియజేసింది.

అను ఇమ్మానుయేల్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అప్పటి నుంచే అల్లు అరవింద్ కుటుంబంతో మంచి రిలేషన్ ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది అను. ఇక ఆ చనువుతోనే ఓ రోజు అల్లు అరవింద్ కూడా నా కొడుకుతో డేటింగ్ లో ఉన్నావా అని ,అడిగేసారట. అసలు జరిగిన వాస్తవాన్ని అల్లు అరవింద్ కి తెలియజేసిందట అను ఇమ్మానుయేల్ . ఇక ఆ తర్వాత ఆ గాసిప్ గురించి మాట్లాడుతూ చాలాసేపు నవ్వుకున్నామని ఇమాన్యుల్ చెప్పుకొచ్చింది.