Tollywood Heroine : రంగుల ప్రపంచం అనే పేరు ఎప్పుడైనా విన్నారా? సినిమా ఇండస్ట్రీకి ఉన్న మరో పేరు అదే. ఈ రంగంలో రాణించాలంటే చాలా టాలెంట్ ఉండాలి. ఎంతో శ్రమించాలి. చివరకు విజయం దక్కుతుంది. ఆ మధ్యలో ఎన్నో కష్టాలు, అవమానాలు, అన్నీ భరించాల్సి ఉంటుంది. బయట వెండి తెర మీద సినిమాలో కనిపించే హీరో, హీరోయిన్ పాత్రలు వేరు.. వాళ్ల తెర వెనుక జీవితం వేరు. తెర వెనుక జీవితాలు చాలా దుర్బలంగా ఉండొచ్చు.. లేదంటే ఇంకా బాగా ఉండొచ్చు. కానీ.. సినీ నటుల జీవితాల గురించి మనం ఎక్కువగా ఊహించలేం. కొందరు హీరోలు, హీరోయిన్లు ఎక్కువగా ఫేమస్ దర్శకులు, నిర్మాతలతో టచ్ లో ఉంటారు.
దానికి కారణం ఆఫర్లు. ఎవరికైనా ఏదైనా ఆఫర్ వస్తేనే సినీ ఇండస్ట్రీలో నెగ్గుకురాగలరు. లేదంటే వాళ్లను ఎవ్వరూ పట్టించుకోరు.తాజాగా ఓ హీరోయిన్ గురించి ఒక చేదు నిజం బయటపడింది. ఆ హీరోయిన్ తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపును సొంతం చేసుకుంది. తను టాప్ హీరోయినే. అయితే కొన్నేళ్ల క్రితం తను ఒక హీరోతో ప్రేమాయణం సాగించింది. తద్వారా తను గర్భం దాల్చింది. వెంటనే ఆ హీరోయిన్ ఓ హాస్పిటల్ లో అబార్షన్ కూడా చేయించుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఆమె స్టార్ హీరోయిన్ కావడంతో ఆ విషయాన్ని బయటికి పొక్కకుండా చూసుకున్నారు. గర్భం దాల్చినా కూడా తనతో పెళ్లికి ఆ హీరో ఒప్పుకోలేదట. దీంతో ఇద్దరూ విడిపోయారు.

Tollywood Heroine : ఆ హీరో తనతో పెళ్లికి ఒప్పుకోలేదా?
కొన్ని రోజులకు ఆ హీరోయిన్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది కానీ.. ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. వాళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ హీరోయిన్ రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందట. తను ఎప్పుడూ సోషల్ మీడియాలో నీతులు చెబుతూ ఉంటుందని, ఇప్పుడు మాత్రం రెండో పెళ్లి అంటూ మళ్లీ పెళ్లి కోసం రెడీ అవడం నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది. వామ్మో.. హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలు ఇలా ఉంటాయా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతానికి తనను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న వ్యక్తి చాలా సంతోషంగానే ఉంటున్నప్పటికీ.. తను మాత్రం ఓవైపు వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూనే రెండో పెళ్లికి సిద్ధమైందట. చూద్దాం మరి ఆ హీరోయిన్ జీవితం ఇంకా ఎంత దూరం వెళ్తుందో?