Prabhas : ఒక మనిషి చనిపోయాక ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుకోవద్దు. అది చాలా తప్పు. ఒక మనిషిలో చెడు ఉండొచ్చు.. మంచి ఉండొచ్చు కానీ.. ఆయన పోయాక.. ఆయన మీద ఉన్న చెడు గురించి మాట్లాడుకుంటే ఏంటి లాభం. వేస్ట్ కదా. చాలామంది అలా చనిపోయిన వాళ్ల మీద పలు ఆరోపణలు చేయడం మనం ఇప్పటి వరకు చూశాం.ప్రస్తుతం రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ కూడా అదే తరహా చిక్కుల్లో చిక్కుకుంది అనిపిస్తోంది. ఎందుకంటే.. ఇటీవలే రెబల్ స్టార్ కృష్ణంరాజు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. ఆయన ఇక లేరని తెలుగు సినీ ఇండస్ట్రీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది.
ఆయన అభిమానులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆయనతో కలిసి నటించిన నటులు, ఇతరులు, రాజకీయ నాయకులు అందరూ కృష్ణంరాజును స్మరించుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ను అయితే ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తన సూటింగ్ ను వదిలేసి మరీ.. తన పెదనాన్న అంత్యక్రియల దగ్గర్నుంచి పెద్ద కర్మ వరకు అన్నీ చూసుకున్నాడు.ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రెబెల్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే ఓ స్టార్ పొలిటిషియన్.. కృష్ణంరాజు చనిపోయిన తర్వాత ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Prabhas : కృష్ణంరాజు కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్న ఓ పెద్దమనిషి
కావాలని కృష్ణంరాజు ఫ్యామిలీకి, ప్రభాస్ కు మధ్య ఆస్తి తగాదాలు పెడుతున్నాడట. ప్రభాస్ ను కృష్ణంరాజు కూతుళ్లు నిలదీసేలా ఆయన వాళ్లను రెచ్చగొడుతున్నాడట. కావాలని ప్రభాస్ ను బ్యాడ్ చేయాలని, ప్రభాస్ కు మీతో సంబంధం లేదు కానీ.. మీ ఆస్తి మొత్తం కాజేయడానికే ఇలా ఉంటున్నాడు అంటూ వాళ్లను రెచ్చగొడుతున్నాడట. ఈ విషయం తెలిసి రెబల్ ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. చూద్దాం మరి.. ఈ విషయం ఇంకా ఎంత దూరం వెళ్తుందో?