Bigg Boss Sudeepa : తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో పాత తరం వారిని వెలుగులోకి తెస్తుంది. ఒకప్పుడు అలరించి కాస్త బ్రేక్ తీసుకున్న వారు బిగ్ బాస్ షోతో లైమ్ లైట్‌లోకి వచ్చేస్తున్నారు. అలా బిగ్ బాస్ సీజన్ 6తో అలరించింది సుదీప. సుదీప ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు . పింకీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన ఒరిజినల్ నేమ్ కంటే క్యారెక్టర్ నేమ్ కి ఎక్కువ జనాలు కనెక్ట్ అయిపోయారు .
నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా పింకీ అనే పాత్రలో మెరిసింది .చాలా చలాకీగా ఉంటూ అల్లరల్లరి చేసింది ..ఆ రోల్ ని పింకీ తప్పిస్తే ఎవ్వరు చేయలేరు అన్న విధంగా తన పేరును జనాలకి ఎక్కిచ్చేసింది. నువ్వు నాకు సినిమాత తర్వాత ఆమె బోలెడు సినిమాల్లో చెల్లి పాత్రలు నటించింది . అయితే ఏ సినిమాకి కూడా పెద్దగా కష్టపడలేదట కానీ సెవెన్ బై జి బృందావన కాలనీ సినిమాకు మాత్రం చాలా కష్టపడిందట . ఈ సినిమాలో తన చెల్లి రోల్ కోసం డైరెక్టర్స్ కొన్ని కండిషన్స్ పెట్టారట . బొద్దుగా ఉన్నావు సన్నగా మారమని చెప్పారట . ఈ సినిమాలో కాస్త నల్లగా ఉండాల్సి ఉందట. నెల రోజుల్లో కాస్త నల్లగా మారేందుకు ప్రయత్నించమని చెప్పారట.

Bigg Boss Sudeepa : అలా చేయాల్సి వచ్చిందా…
ఈ కండీషన్‌కి ఏం చేయాలో తెలియక రోజు ఒక గంట సేపు ఎండలో నిల్చుందట. దీంతో ఫేస్ ట్యాన్ అయిపోయి బ్లాక్ షేడ్ గా మారిపోయిందట. అంతలా సెవెన్ బై జి బృందావన కాలనీ సినిమా కోసం కష్టపడ్డాడని సుదీప చెప్పుకొచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును అందుకున్న సుదీప బిగ్ బాస్ లో తప్పకుండా చివరి వరకు నిలుస్తుంది అని కూడా అనుకున్నారు. కానీ ఆమె చేసిన కొన్ని మిస్టేక్స్ కారణంగా ఓట్లు కూడా సరిగ్గా పడలేదు. దీంతో ఇప్పుడు ఆరో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. సుదీప రెమ్యునరేషన్ పరంగా అయితే బాగానే లాభ పడినట్లు తెలుస్తోంది. ఒక వారానికి ఆమె 25 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు టాక్. ఇక మొత్తం ఆరువారాలకు 1 లక్ష 50 వేలు అందుకున్నట్టుగా తెలుస్తోంది.