Sudigali Sudheer : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో కి ఏది పోటీ రాదు. దాదాపుగా 10 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ, నవ్వులను పంచుతూ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఇక ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్సు స్టార్స్ గా ఎదిగారు. ఇలా జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ అందుకున్న చాలామంది ఇప్పుడు సినిమాలలో చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఇక ఈ జబర్దస్త్ షో ద్వారా వినుత్న రీతిలో , పాపులారిటీ సంపాదించుకున్న వారిలొ మొదటిగా వినిపించే పేరు సుడిగాలి సుదీర్. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టీం లీడర్ గా ఎదిగి , తన మాటలతో తన నవ్వులతో తన స్టైల్ తో స్టార్ హీరో రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు సుధీర్ కి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇక ఈ ఫాలోయింగ్ క్యాచ్ చేసుకునేందుకు అన్ని చానల్స్ సుడిగాలి సుదీర్ తో రకరకాల షోలను నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు సుడిగాలి సుధీర్. కాగా ఇప్పుడు మరలా సరికొత్త కామెడీ షో ద్వారా సుడిగాలి సుదీర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఓటిటి ప్లాట్ఫామ్ అయినా ఆహా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఓటిటి ద్వారా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించే క్రమంలో , కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షో కి సుధీర్ యాంకరింగ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ షో కి అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించబోతున్నారట. అలాగే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన కమెడియన్స్ ఈ షో ద్వారా ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని షోలు వచ్చినా జబర్దస్త్ పోటీ మాత్రం ఇవ్వలేవు. మరి సరికొత్త కాన్సెప్ట్ వస్తున్న ఈ షో జబర్దష్ కు పోటీ ఎలా ఇస్తుందో చూడాలి.