Surekha Vani : సినీ పరిశ్రమలో తల్లిగా.. వదినగా.. అక్కగా ఎన్నో సహయపాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటి సురేఖ వాణి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. కూతురితో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు.. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. దీంతో తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలను కొట్టిపడేసింది. తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదంటూ సూటిగా చెప్పేసి.. ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.
ఇవే కాకుండా.. తన వ్యక్తిగత జీవితం పై.. తన కూతురు గురించి వచ్చే కామెంట్లకు తనదైన శైలీలో ఆన్సర్ ఇస్తుంటుంది సురేఖ. అయితే తాజాగా స్వాతి ముత్యం సినిమా సక్సెస్ మీట్లో పాల్గోన్న ఆమె.. భావోద్వేగానికి గురయ్యింది. చాలా మంది తనను సురేఖ వాణి సినిమాలు ఎందుకు చేయడం లేదని అంటున్నారని.. కానీ అవకాశాలు తన వరకు రావడం లేదని.. వస్తే తప్పకుండా చేస్తానంటూ ఎమోషనల్ అయ్యారు.”సురేఖ వాణి ఎందుకు సినిమాలు చేయట్లేదు ?.. ఈ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇలాంటి మీరు చేయండి అని అడుగుతున్నారు. కానీ మాదాక వస్తే కదా మేం చేయడానికి.

మా వరకు అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను సినిమాలు మానేసాను అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. నేను సినిమా అమ్మాయిని.. సినిమా కోసమే ఉన్నాను. ఎప్పటికీ మూవీస్ చేస్తూనే ఉంటాను. నాకు లక్ష్మణ్ మొదటిసారి కథ చెప్పడానికి వచ్చినప్పుడు.. నిజంగానే ఈ పాత్రకు నన్ను అనుకున్నావా అని అడిగాను. ఎందుకంటే నావరకు అవకాశాలు రావట్లేదు. ” అంటూ చెప్పుకొచ్చారు సురేఖ వాణి.ఇదిలా ఉంటే.. సురేఖ వాణి కూతురు సైతం హీరోయిన్గా అరంగేట్రం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మంచి స్టోరీ వస్తే కూతురిని కథానాయికగా పరిచయం చేసేందుకు సురేఖ వాణి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.