Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. లేలేత అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటుంది. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. . ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. ఇక అక్కడ నుండి వెనక్కి చూసుకోలేదు. వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందింది.
సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. బాహుబలి సినిమాతో తమన్నా క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి పాకింది. ఇటీవల ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలలలో నటిస్తూ రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది . తమన్నా ఇంత వయస్సు వచ్చినా కూడా క్యూట్ లుక్స్ లో కనపడడానికి మెయిన్ రీజన్ ఆమె పడుకునేటప్పుడు కచ్చితంగా 10 నిమిషాలు ఓ వ్యాయామం చేస్తుందట. ఇక వీలున్న సమయంలో తప్పక జిమ్ చేస్తుందట.

Tamannah : తమన్నా సీక్రెట్ ఇదే..
తమన్నా ఎప్పుడైన కూడా ఏడు గంటల లోపు తన డిన్నర్ ని ఫినిష్ చేస్తుందట . అంతేకాదు ఆ తర్వాత రెండు గంటలసేపు వాకింగ్ చేసి ..బెడ్ పైకి వచ్చాక అమ్మడు తన లాళ్లని రెండు పైకి ఎత్తి మోకాళ్ళను ముఖం పైకి ఆనుస్తుందట. అలా చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ కరుగుతుందని ..స్టమక్ ఫ్లాట్ గా ఉంటుందని ..నడుము నాజూకుగా ఉంటుందని అలా చేస్తుంట. బాడీ కూడా కరెక్ట్ షేప్‌లోకి వస్తుందని తమన్నా అలా చేస్తూ ఉంటుందట. ఇదే తమన్నా సీక్రెట్ అని కొందరు అంటున్నారు. ఇక ఇటీవల తమన్నా పెళ్లి, పిల్లలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. ‘నేను పెళ్లికి వ్యతిరేకిని కాదు. ఇన్నాళ్లు సినిమాల బిజీలో పడి నా పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే, నేను త్వరలోనే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలనుకుంటున్నాను’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.