JR NTR – Taraka Ratna : నందమూరి కుటుంబం నుంచి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ సినిమాకు వేరియంట్స్ చూపిస్తూ ఈ స్థాయికి వచ్చాడు.అయితే, ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన పర్సనాలిటీ మీద చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో తారకరత్న ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్‌ను దారుణంగా అవమానించాడట..
జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎదుగుతున్న క్రమంలో నందమూరి కుటుంబంలో కొందరు అతన్ని తొక్కడానికి చూశారట.. కానీ అది సాధ్యం కాలేదు. అందుకే జూనియర్‌కు పోటీగా తారకరత్నను రంగంలోకి దించాడట.. అప్పుడు నందమూరి కుటుంబంలో హరికృష్ణ మినహా మిగతా అందరూ చంద్రబాబు కుటుంబానికి సపోర్టు చేసినవారే. హరికృష్ణ కొంతకాలం టీడీపీలో కొనసాగిన ఆ తర్వాత బయటకు వచ్చేశారు.అందుకు కారణం చంద్రబాబు వైఖరే అని తెలిసింది. ఇక తన తాత పెట్టిన పార్టీని చంద్రబాబు సొంతం చేసుకోవడం యంగ్ టైగర్‌కు అస్సలు నచ్చలేదట.

JR NTR – Taraka Ratna : అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది..
ఎన్టీఆర్ ఎదిగితే ఎక్కడ తెలుగుదేశం పార్టీలో తనకు అడ్డుగా వస్తాడని భావించిన చంద్రబాబు తారకరత్నను హీరోగా చేయాలని చాలా ప్రయత్నించారట.. కానీ తారకరత్నను ఆడియెన్స్ ఆదరించలేకపోయారు. ఎన్టీఆర్ మాస్ బేస్డ్ కంటెంట్ ఎంచుకుంటూ పవర్ ఫుల్ హీరోగా మారాడు.తన తాత మాస్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అయితే, ఎన్టీఆర్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాక ఒకసారి హరికృష్ణతో కలిసి ఏదో ఫంక్షన్‌కు వెళ్లిన క్రమంలో తారకరత్న ఎన్టీఆర్నుఅవమానించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఆలస్యంగా స్పందించిన తారకరత్న అలాంటిది ఏమి లేదని.. అవన్నీ కావాలని నాపై పుకార్లు పుట్టించారు.ఎన్టీఆర్‌ను నేను ఎందుకు అవమానిస్తాను అని క్లారిటీ ఇచ్చారు.