Trivikram : హారిక హాసిని ప్రొడక్షన్స్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితుడు. ఈ ప్రొడక్షన్ హౌస్ లో జరిగే ప్రతి సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించడమే కాకుండా , ఈ ప్రొడక్షన్లో జరిగే అనేక సినిమాలకు త్రివిక్రమ్ యొక్క సహాయ సహకారాలు ఉంటాయట. అయితే లేటెస్ట్ గా హారిక హాసిని ప్రొడక్షన్ నిర్మించిన “స్వాతిముత్యం” మూవీ ఈ దసరాకు విడుదలైన సందర్భంగా ఈ మూవీని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అలాగే పలుచోట్లకు ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళాడు సూర్యదేవర నాగ వంశీ. దీనిలో భాగంగా అతను ఇంటర్వ్యూలో చెప్పిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
అయితే అతనికి త్రివిక్రమ్ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ లో ఒక భారీ సినిమా తీయాలని కోరిక ఉందట.ఏదో ఒక రోజు తమ నిర్మాణ సంస్థ నుండి ఆ భారీ చిత్రం వస్తుందని చెప్పుకొచ్చాడు నాగ వంశీ. అయితే రీసెంట్గా త్రివిక్రమ్ తన స్ట్రేటజీ మార్చుకొని పాన్ ఇండియా లెవెల్ పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందె. దీనిలో భాగంగా త్రివిక్రమ్… ప్రభాస్ మరియు రామ్ చరణ్ లతో వేర్వేరుగా రెండు పాన్ ఇండియా మూవీలను చేయాలనుకుంటున్నారు అన్న వార్తలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కి కూడా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ,పాన్ ఇండియా మూవీలను చేయాలని ఉందట. తన మాటలతో తన చేతలతో బాలీవుడ్ రేంజ్ లో ఒక సినిమా తీయాలనే కోరిక త్రివిక్రమ్ కు ఏర్పడింది.

దీనికి నాగ వంశీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే వీరిద్దరి కలయికలో బాలీవుడ్ రేంజ్ సినిమాను చూడవచ్చు అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన మాటలను తన సినిమాలో ఉపయోగించినట్లే నిజ జీవితంలో కూడా చాలా ఖర్చుదారి అని తన సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈమధ్య త్రివిక్రమ్ కట్టుకున్న సొంత ఇంట్లో ఫర్నిచర్ మరియు ఇంటీరియర్‌ను చూసినవారు అదే ఒక సినిమా సెట్ లో ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.