Mohan Babu : తెలుగు సినీ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎదిగిన తీరు విధానం చాలామందికి స్ఫూర్తిదాయకం. ఎలాగైనా నటుడిని కావాలి అన్న తపనతో చెన్నై వెళ్లి ఆఫర్స్ కోసం కాలు అరిగేలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారట,అన్నం లేకపోయినా ఖాళీ కడుపుతో పడుకున్నాడట.ఇక విలన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. వచ్చి రాగానే వరుస బ్లాక్ బస్టర్లతో కలెక్షన్ కింగ్ అనే పేరును పొందాడు. అంత కష్టపడి పైకి వచ్చిన అతనికి ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. తన కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లోనే , జీవితంలో పలు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిలో అతని మొదటి భార్య మరణం ఒకటి.
మోహన్ బాబు మొదటి భార్య విద్యా దేవి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇక విద్యా దేవి ఆత్మహత్యకు గల అసలు కారణాలేంటో కొన్ని సందర్భాలలో మోహన్ బాబు తెలియపరుస్తూ వచ్చారు. సినీ పరిశ్రమలో మోహన్ బాబు నిలబడక ముందే విద్యదేవిని పెళ్లి చేసుకున్నారు. భార్యతో కలిసి చెన్నైలో కాపురం పెట్టారు మోహన్ బాబు. ఇంకా అప్పట్లో తనకి ఆడపాదడపా అవకాశాలు చాలీచాలని సంపాదనతో వారు చాలా కష్టాలు పడేవారని చెప్పుకోచాడు మోహన్ బాబు. అలా ఒకరోజు ఇంటి అద్దె ఇవ్వలేదని ఓనర్ వచ్చి సామాన్లు బయటకు విసిరేసి తినే పాత్రలో మూత్రం పోసాడట. ఇక ఆరోజు మోహన్ బాబు విద్యాదేవి చాలా బాధపడ్డారట. ఇక దాంతో ఎలాగైనా సరే నటుడిగా ఎదగాలని మోహన్ బాబు చాలా కష్టపడే వారట.

ఎక్కువ సమయం సినిమాలో నటించేవాడట సరిగా ఇంటికి వచ్చేవాడు కాదట. ఇలాంటి సమయంలోనే విద్యా దేవికి లక్ష్మీ మరియు విష్ణు పుట్టారు. ఇక మోహన్ బాబు భార్య పిల్లలను సరిగా చూసుకోవడం లేదని ఆలోచన విద్యాదేవికి పెరిగిపోయింది. ఇలాగే ఒకరోజు చనికావేశంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. విద్యా దేవి చనిపోయాక పిల్లలు , అనాధలవుతారని దాసరి నారాయణరావు మోహన్ బాబుకు రెండో వివాహం చేశాడు. వేరే అమ్మాయి అయితే తన పిల్లలను సరిగా చూసుకోదేమో అని అనుమానంతో విద్యాదేవి చెల్లి అయిన నిర్మలాదేవినే మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు.ఆ తర్వాత నిర్మాలాదేవికి మనోజ్ పుట్టాడు. అలాగే మంచు విష్ణు, లక్ష్మి , వాళ్ళ అక్క పిల్లలు అవడంతో నిర్మలాదేవి ముగ్గురిని సరి సమానంగా చూస్తూ పెంచింది. వారి మధ్య అనుబంధం కూడా అలాగే ఉంటుందని చెప్పాలి.