Prabhas : బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును పొందాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీ రాముడు పాత్రలో వస్తున్నాడు అనగానే , ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. టీజర్ విడుదల కాకముందు వరకు ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. ప్రభాస్ అభిమానులైతే ఈ సినిమాపై బలమైన నమ్మకమును పెట్టుకున్నారు.
కానీ ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు ఊహించని విధంగా నెగటివ్ కామెంట్స్ రావడంతో , అభిమానులు పెట్టుకున్న నమ్మకం,అంచనాలు తునాతునకలైపోయాయి.అయితే ఈ సినిమాపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా టీజర్ చూడగానే నాకు భిన్నంగా కనిపించిందని చెప్పాడు ఆర్ జీవి. అయితే ముందుగా మనం ఏ విషయం గురించి తెలియజేయాలనుకుంటున్నామో దాని ముందే ప్రేక్షకులకు తెలియజేస్తే ఇలా ట్రోల్స్ వచ్చేవి కాదని ఆర్జీవి చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా రావణాసుడు పాత్ర లో నటించిన సైఫ్ అలీ ఖాన్ ను , చూపించిన విధానం చాలా కొత్తగా ఉందని ,రావణాసురుడి పాత్ర అంటే ఎప్పుడు ఎస్పి రంగారావు గారిని ఊహించుకునే వాడినని, కానీ దీనిలోని రావణాసురుడు పాత్ర చాలా డిఫరెంట్ గా ఉందని తెలియపరిచాడు .అలాగే కొంతమంది తనకు ఫోన్ చేసి శ్రీరాముడికి అంత పెద్ద మీసాలు ఏంటి అని అడగగా , వాళ్ళేదో కొత్తగా చూపిద్దామనుకుంటున్నారులే అని సమాధానం ఇచ్చాడట ఆర్జీవి. ఇప్పటివరకు వచ్చిన రామాయణం కథలన్నీ రెగ్యులర్ గా ఉన్నాయి కానీ , ఈ సినిమా కొత్త తరహాలో రాబోతుందని తెలుస్తుంది అని రాంగోపాల్ వర్మ తన శైలిలో వివరణ ఇచ్చారు.