Bigg Boss 6 Telugu : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 మొదలై 5 వారాలు పూర్తవుతుంది. ఇక ఆరో వారంలో అడుగుపెడుతుండగా ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఇప్పటిదాకా స్ట్రాంగ్ అనుకున్న చలాకి చంటి 5 వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు. తను ఎలిమినేట్ అవుతాడని అసలు ఎవరు ఊహించలేదు కానీ ఆయన ఆటతీరు వలన ప్రేక్షకుల నుండి ఇలాంటి స్పందన వచ్చింది.అయితే 6వ వారంలో కూడా వీక్ కంటెస్టెంట్ చాలామంది ఉన్నారు.
వీరి లో కొంతమంది ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వకుండా అదృష్టవశాత్తు తప్పించుకుంటున్నారు. అలాగే కొందరు స్ట్రాంగ్ అయిన కూడా దురదృష్టవశాత్తు ఎలిమినేట్ అవుతున్నారు. అయితే ప్రతి సోమవారం వచ్చే ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దానికి కారణం ఎలిమినేషన్ రౌండ్ ఉండడమే. ఈ రౌండ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది .అయితే ప్రతి సోమవారం ఎపిసోడ్ కు సంబంధించిన లీక్ ను రెగ్యులర్ గా మనం చూస్తుంటాం. అయితే ఈ వారం కూడా అది లీక్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ లో ఉండబోయేది ఎవరో అప్పుడే బయటకు వచ్చేసింది.

ఈ వారంలో మొహానికి తెల్లటి ఫోమ్ ను రాస్తూ ఒక్కొక్కరు ఇద్దరినీ నామినేట్ చేయాల్సి ఉంటుందట. ఇలా నామినేట్ అయిన వాళ్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. నామినేట్ అయిన వాళ్ళ విషయానికి వస్తే ఇనాయా సుల్తానా, బాలాదిత్య,ఆదిరెడ్డి , అర్జున్ కళ్యాణ్ ,సుదీప , కీర్తి భట్ , శ్రీహన్ , గీతు రాయల్ ఉన్నారు అనే వార్త బయటకు వచ్చింది. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక అందులో నిజం ఎంతుందో వేచి చూడాల్సి ఉంది. ఇక నేడు రాత్రి ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఎపిసోడ్ మంచి రసవత్తంగా ఉంటుందని లీక్ ను బట్టి తెలుస్తుంది.