Star Heroine : సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగులు ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా మారుతుందో ఊహించలేం. ఊసరవెల్లి రంగుల మార్చినట్టు ఇండస్ట్రీలో నటీనటులు చాలామంది మారుతుంటారు. అయితే ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ తో బలవంతంగా లిప్ కిస్ , సీన్ ను చేయించారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.రకుల్ ప్రీత్ సింగ్ “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్” సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద హీరోలతో నటించి తన క్రేజ్ ను పెంచుకుంది.
తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో అడుగుపెట్టి ,అక్కడ కూడా అవకాశాలను అందిపుచ్చుకుంది. కోలీవుడ్ లో కూడా ఘన విజయాలను అందుకుంది. దీంతో బాలీవుడ్ లో అవకాశం రావడంతో బాలీవుడ్ వైపు అడుగు వేసింది రకుల్. కాగా బాలీవుడ్ లోని స్టార్ హీరో తో రకుల్ ఒక మూవీ చేయగా , అందులో చేసిన లిప్ లాక్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా విడుదలైన మొదట్లో అయితే రకుల్ ను నెగిటివ్ కామెంట్స్ తో మోత మోగించారు జనాలు.

తెలుగు హీరోలతో ఇలా ఎప్పుడు చేయలేదు గా అంటూ కామెంట్స్ చేశారు . అయితే నిజానికి ఆ లిప్ లాక్ సీన్ ను డైరెక్టర్ ఆమెకు మొదట్లో వివరించలేదట. కాని షూటింగ్ టైంలో సడన్ గా ఒక రోజు ఈ సీన్ ఉందని చెప్పి రెడీగా ఉండమని చెప్పారట. అయితే రకుల్ ఈ సీన్ నేను చేయను అని చెప్పడంతో డైరెక్టర్ బ్లాక్ మెయిల్ కూడా చేశారట. హాలీవుడ్ లో ఇలాంటివి జరుగుతుంటాయి నువ్వు హీరోయిన్ గా ఎదగాలి అంటే ఇవి చేయక తప్పదు , అంటూ తనకిష్టం లేకుండానే ఆ లిప్‌లాక్ సీన్ ను చేశారట. ఈ విషయం అప్పట్లో ఒక సంచలనంగా మారింది.