Artist Tulasi : తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరును సంపాదించుకుంది నటి తులసి. ఇప్పటివరకు 300కు పైగా సినిమాలలో నటించింది. చాలామంది అగ్ర హీరోల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అలాగే ఎంతోమంది గొప్ప డైరెక్టర్స్ తో పనిచేసింది తులసి. మరి ముఖ్యంగా డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి సినిమాలలో ఈమెకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. ఇక శంకరాభరణం లాంటి సినిమాల్లో నటించి తన పేరును సంపాదించుకుంది. ఇక ఈ మధ్యన వచ్చిన కార్తికేయ 2 సినిమాలో నటించి తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది తులసి.తులసి గారి సిని జీవితం కాకుండా నిజ జీవితం లోకి వెళితే తులసి సాయిబాబా భక్తురాలట. ఈమె చిన్నప్పటి నుంచి తన తాతగారి పెంపకంలో పెరగడం వలన ఇక తన తాతయ్య వ్యక్తిత్వం తన కెరియర్ పైన చాలా ప్రభావం చూపించిందట. దానివలన చిన్న వయసు నుండే బాబా భక్తుడునే పెళ్లి చేసుకుంటానని తులసి చెప్పేదట. వారి తాతగారు కూడా నువ్వు ఒక్క రోజులోనే పెళ్లి చేసుకుంటావులే అనేవారట. ఇక తాను నటించడానికి కన్నడ వెళ్ళగా అక్కడ శివమణితో పరిచయం ఏర్పడింది.

ఓ సినిమా లోని పాత్ర కోసం తనను తీసుకున్నారని అయితే అక్కడ శివమణితో పరిచయం ఏర్పడి ఆయనకు సాయి బాబా ఫోటో కూడా ఇచ్చానని ఇలా ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడి వివాహం చేసుకున్నామని తెలియజేసింది తులసి. ఇక తన వివాహం కూడా వారి తాత గారు కట్టించిన గుడిలోనే జరిగిందట. శివమణి గారు మలయాళం అయినప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు వారి పెళ్లిని ఒప్పుకోవడానికి మూడు రోజులు పట్టిందట. ఇక తులసి గారింట్లో తులసి ఫోన్ చేసి చెప్పగా బాబా నిన్ను చల్లగా చూడు గాక అంటూ దీవించారట.ఇక ఆమెకు సాయిబాబా మీద ఉన్న భక్తితోనే వీరి కొడుకుకు సాయి తరుణ్ అనే పేరును పెట్టినట్లుగా తెలియజేశారు.