Serial Heroines : ఈ రోజుల్లో సినిమాలకి ఉన్నంత ప్రాముఖ్యత సీరియల్స్ కి కూడా ఉంది. ఇంకా ఆడవారు సీరియల్స్ ను ఎక్కువగా అభిమానిస్తారు. కాగా సినిమా హీరోయిన్స్ కి ఉన్నంత పాపులారిటీ సీరియల్ హీరోయిన్స్ కూడా ఉంది.అలాగే వీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ అభిమానులకు తమ పర్సనల్ విషయాలన్నిటిని తెలియజేస్తున్నారు. వారి పర్సనల్ లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల తో పంచుకుంటున్నారు. అలాగే యూట్యూబ్ ద్వారా తమ రోజువారి పనులను మరియు షూటింగ్ టైం లో వారు ఎలా ఉంటారు అనే విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే ఇటీవల ముగ్గురు సీరియల్ హీరోయిన్స్ , తాము ప్రెగ్నెంట్ అయినట్టుగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు.
కొంతమంది యూట్యూబ్ లో వీడియోను పోస్ట్ చేసి తెలియజేశారు.ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లాస్య ( Anchor Lasya ) : యాంకర్ గా నటిగా రానిస్తున్న లాస్య కొన్ని సంవత్సరాల క్రితం ఒక బిడ్డకుజన్మనిచ్చింది.మళ్లీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయిందని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో రూపంలో తెలియజేసింది. దీంతో తన అభిమానులు లాస్యకు అభినందనలు చెబుతున్నారు. శ్వేత: ఈ టీవీలో ప్రసారమవుతున్న శతమానం భవతి సీరియల్లో శ్వేత ( swatha ) హీరోయిన్ గా నటిస్తుంది.శ్వేత యొక్క మొదటి సీరియల్ ఇదే.మొదటి సీరియల్ తోనే ఎంతో పేరును సంపాదించుకుంది.అయితే తను ప్రెగ్నెంట్ కావడంతో సీరియల్ నుండి తప్పుకుంది. శ్వేత తను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసింది.

అలాగే వైష్ణవి ( Vaishnavi ) అనే సీరియల్ నటి కూడా తానుతల్లి కాబోతుంది అన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అలాగే జబర్దస్త్ మరియు బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన ముక్కు అవినాష్ భార్య అనూజ కూడా ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. వీరంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం వలనతమ పర్సనల్ విషయాలను నేటి జనులతో షేర్ చేసుకుంటున్నారు .అందరూ వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.