Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో రీసెంట్ గా అతి పెద్ద విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిరాదేవి(70) బుధవారం వేకువజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఇంట్లో కన్నుమూశారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతిచెందిన వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్‌స్టార్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేశారు.
ఇక నిన్న సాయంత్రం మహా ప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియల జరగగా, ఆ సమయంలో మహేష్‌తో పాటు కృష్ణ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే మహేష్ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడి దొంగతనానికి ప్రయత్నించినట్లు వార్తలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ప్రస్తుతం మహేష్ బాబు జూబ్లీ హిల్స్ రోడ్ నెం.81లో నివాసం ఉంటున్నారు.ఆయన ఇంట్లోకి ఒరిస్సాకు చెందిన కృష్ణ అనే వ్యక్తి చొరబడే ప్రయత్నం చేశాడు. మంగళవారం రాత్రి ప్రహరి గోడను దూకే ప్రయత్నంలో అతనికి గాయాలయ్యాయి. అక్కడే పడిపోయాడు. శబ్దం రావటంతో సెక్యూరిటీ వెళ్లి చూడగా, గాయాలతో పడి ఉన్న వ్యక్తి కనిపించాడు.

Mahesh Babu : దొంగతనం..
పోలీసులుకి సమాచారం అందించడంతో వెంటనే వాళ్లు వచ్చి కృష్ణని తీసుకెళ్లారు. గాయపడ్డ ఒరిస్సా వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసి విచారణ చేయగా, అతను మూడు రోజుల ముందు హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉన్న నర్సరీలో పని చేస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం అతినికి చికిత్స అందిస్తుండగా, ఆ వ్యక్తి కోలుకున్న తర్వాత పూర్తి స్థాయి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.ఇక మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగా, ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు. హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రం ఉండనున్నట్టు తెలుస్తుంది.