Bigg Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్షకులని ఫుల్ గా ఎంటర్టైన్ చేసే రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం తెలుగులో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ క్రమంలోనే సీజన్ 6 లాంచ్ అయింది. ఆదివారం రోజు గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ షోలో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ సందడి చేశారు. మొదట నటి కీర్తి భట్ని పరిచయం చేశారు నాగార్జున. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ చైల్డ్ ఆర్టిస్ట్ `పింకీ`గా పాపులర్ అయిన సుదీపని పరిచయం చేశారు నాగార్జున. తనది లవ్ మ్యారేజ్ అనే విషయాన్ని ఏవీలో తెలిపింది సుదీప. ఇక బిగ్ బాస్ లోకి మూడో కంటెస్టెంట్ గా గత సీజన్ కంటెస్టెంట్ సిరి భర్త శ్రీహాన్ అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో కాస్తా పాపులారిటీ తెచ్చుకున్న శ్రీహాన్ బిగ్ బాస్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. నాలుగో కంటెస్టెంట్ నేహా చౌదరి అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. .
హౌజ్ లో ఉంటూ ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పి హౌజ్ లోకీ ఎంట్రీ ఇచ్చింది. హౌజ్ లోకి ఐదో కంటెస్టెంట్ గా జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటీ ఎంట్రీ ఇచ్చారు. తొమ్మిదేండ్లలో తల్లిని కోల్పోయి చాలా కష్టాలు పడ్డట్టు చెప్పారు ఆరో కంటెస్టెంట్ గా మోడల్ శ్రీసత్య ఎంట్రీ ఇచ్చారు. ఏడో కంటెస్టెంట్ గా, నాగార్జున ఫ్యాన్ బాయ్, నటుడు అర్జున్ కళ్యాణ్ అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. వైజాగ్ లో బీటెక్ పూర్తి చేసి, న్యూయార్క్ లో ఎంఎస్ చేశారు. హౌజ్ లోకి ఎనిమిదో కంటెస్టెంట్ గా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గీతు రాయల్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ లోకి రావడానికి మూడు కారణాలు అని చెప్పింది. తొమ్మిదో కంటెస్టెంట్ గా నటి అభినయ శ్రీ షాకిచ్చే పెర్ఫామెన్స్ తో ఎంటర్ అయ్యింది.

Bigg Boss 6 Telugu : సందడే సందడి..
ఇప్పటి వరకు 100కు పైగా సాంగ్స్ లో నటించిందని, బిగ్ బాస్ హౌజ్ ద్వారా మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది. పది, పదకొండో కంటెస్టెంట్స్ గా రోహిత్ సాహ్ని మరీనా ఎంట్రీ ఇచ్చారు. రొమాంటిక్ సాంగ్ తో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. కపుల్‌గా వీరు సందడి చేయబోతున్నారు. యాంకర్ బాలా ఆదిత్య 12వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక 13వ కంటెస్టెంట్ గా వసంతి క్రిష్ణన్ ఎంపికయ్యారు. 14వ కంటెస్టెంట్ గా సొలమాన్ ఎంట్రీ ఇచ్చారు. మోడల్, యాక్ట్రెస్ ఇనాయా సుల్తానా 15వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 6లోకి 16 కంటెస్టెంట్ గా ఆర్జే సూర్య ఎంట్రీ ఇచ్చాడు. 17వ కంటెస్టెంట్ గా ఫైమా ఎంపికైంది. తర్వాత హౌజ్ లోకి యూటూర్, బీబీ రివ్యూయర్ ఆదిరెడ్డి 18వ కంటెస్టెంట్ గా ఎంపికయ్యారు. 19వ కంటెంటెస్ట్ గా మోడల్ రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ గా కేరీర్ మొదలెట్టిన అరోహి రావు ( అంజలి) బిగ్ బాస్ హౌజ్ లోకి 20వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. చివరి కంటెస్టెంట్ (21) గా బిగ్ బాస్ బాస్ -6లోకి సింగర్ రేవంత్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. వీరు వంద రోజుల పాటు హౌజ్‌లో రచ్చ చేయబోతున్నారు.