Bigg Boss 6 Telugu : తెలుగులో ప్రసారం అవుతున్న బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. 21 మంది కంటెస్టెంట్స్‌లను హౌస్‌లోకి పంపి.. తొలివారంలో నో ఎలిమేషన్స్ అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చి, ఆ తర్వాత రెండోవారంలో అంతకు మించిన ట్విస్ట్ ఇచ్చారు. డబుల్ ఎలిమినేషన్ అంటూ షానీని, అభినయశ్రీని బయటకు పంపారు. రెండోవారంలో ఆది రెడ్డి, రోహిత్-మెరీనా, షానీ సాల్మన్, రాజ్, రేవంత్, అభినయ శ్రీ, ఫైమా, గలాటా గీతు ఈ ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉండగా, కత్తి వేటు సాల్మన్, అభినయ మీదే పడింది. ఇక మూడో వారం ఎవరు నామినేట్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. గత వారం నాగార్జున ఇచ్చిన క్లాస్‌కి అందరు బాగానే ఆడిన కొందరి పర్‌ఫార్మెన్స్లో మాత్రం పెద్దగా తేడా లేదు.
ఈ వారం ఎలిమినేషన్‌లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో బాలాదిత్య, నేహా, గీతు, రేవంత్ , శ్రీహన్, చలాకీ చంటి టాప్‌లో ఉండగా, ఇక డేంజర్ జోన్‌లో సుదీప,ఆరోహి,ఇనయా సుల్తానా ఉన్నారు. మొత్తంగా వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేషన్ కానున్నారు. అయితే ఫస్ట్ వీక్‌లో ఇనయ సుల్తానా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకోగా, ఈవారం మాత్రం తప్పక ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. ప్రతి ఒక్కరిపై తాను నోరు పారేసుకోవడం, దాడులు చేయడం వంటి వాటి వల్లనే ఇనయన ఎలిమినేట్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది.

Bigg Boss 6 Telugu : డేంజర్ జోన్..
గత సీజన్స్ కన్నా ఈ సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోతుందని అంటున్నారు. బిగ్‌బాస్ లాంఛింగ్ ఎపిసోడ్‌కు ఈ సారి దారుణమైన రేటింగ్ వచ్చింది. గతంలో లాగా నాగార్జున హోస్ట్‌గా అంతగా మెప్పించలేకపోతున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గత రెండు సీజన్స్‌లలో అలరించిన విధంగా 5వ సీజన్, 6వ సీజన్‌లలో అలరించలేకపోతున్నారనే టాక్ నడుస్తుంది. బిగ్‌బాస్ సీజన్ 6కు ఫస్ట్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 8.86 రేటింగ్ రాగా, ఇప్పటి వరకు వచ్చిన ఐదు సీజన్స్‌లో ఇదే దారుణం. ప్రారంభ ఎపిసోడ్ కే ఈ రేటింగ్ వస్తే.. వీక్ డేస్‌లో ఎలా ఉంటుంది. మరి షోని ఇంకాస్త రక్తి కట్టించాల్సిన అవసరం ఎంతైన ఉంది.