Pranitha Subhash : ప్రణీత సుభాష్ ఈ పేరును ఎవరు అంతగా త్వరగా గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ అత్తారింటికి దారేది సినిమాలో నటించిన రెండో హీరోయిన్ అంటే గుర్తుపడతారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరో గా అత్తారింటికి దారేది సినిమాలో మొదటి హీరోయిన్ గా సమంత నటించిగా, రెండో హీరోయిన్ గా నటించిన ఆ ముద్దుగుమ్మ నే ప్రణీత సుభాష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ హీరోయిన్ గా చాలా సినిమాలలో నటించింది ప్రణీత సుభాష్. 2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమాను , కన్నడలో రిమేక్ చేయగా దానిలో ప్రణిత సుభాస్ నటించి మొదటగా ఇండస్ట్రిలోకి అడుగు పెట్టింది .
తెలుగు లో అయితే బావ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమ కు పరిచయం అయింది. ఆ సినిమా కూడా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆమెకు హీరోయిన్ గా మరిన్ని అవకాశాలను ఇవ్వలేకపోయింది. దీంతో దొరికిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలో సాగుతుంది ప్రణీత సుభాష్. ఇక ఇప్పుడ ఈమె పెళ్లి చేసుకొని పండంటి పాపకు జన్మనిచ్చింది. 2021 మే 30న గుట్టు చప్పుడు కాకుండా బడా వ్యాపారవేత్త అయిన నితిన్ రాజు ను పెళ్లి చేసుకుంది ప్రణిత సుభాస్ .

పెళ్లి అయితే తెలియకుండా చేసుకుంది కాని తన ప్రెగ్నెన్సీ విషయం మాత్రం సోషల్ మీడియా వేదికగా గ్రాండ్ గా అందరికీ తెలిసేలా చేసింది. 2022 జూన్ 10 న పండంటి పాపకు జన్మనిచ్చింది.కాగా ఇప్పుడు ఈ అమ్మడు ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది . ఇక ఆ ఫోటోలో ప్రణిత సుభాష్ ఒక బొమ్మ కి ముద్దు పెడుతూ ఫోటో దిగింది .దీంతో ఫోటో చూసిన ప్రతి ఒక్కలు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆపుకోలేకపోయావా ని భర్త పక్కన లేడా అని వాల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.